E-Paper
Advertisement

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్
Advertisement

Pawan Kalyan: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో తీవ్ర కలకలం రేగింది. అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లెకు వెళ్లే బీటీ రోడ్డును వైకాపా నాయకులు ట్రాక్టర్‌తో తొలగించి ధ్వంసం చేయడం స్థానికంగా పెద్ద దుమారాన్నే లేపింది. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ప్రజా ఆస్తిని ఈ రకంగా నాశనం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా స్పందించారు.

క్షమించరాని నేరం.. నాన్ బెయిలబుల్ కేసులు!

Advertisement

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఆస్తి నష్టం రికవరీకి ఆదేశాలు

Advertisement

కేవలం కేసులతో సరిపెట్టకుండా, ధ్వంసమైన రహదారికి అయిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబట్టాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం రెవెన్యూ రికవరీ (RR) యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించాలనే ఆలోచన చేయాలంటేనే భయపడేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రోడ్లను వ్యక్తిగత, రాజకీయ కక్షలతో పాడు చేస్తే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని ఈ ఘటన ద్వారా ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:అలియాబాద్‌లో విషాదం.. చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి 

Tags

Related News

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

దావూద్ ఇబ్రహీంకు జగన్ తేడా లేదు.. ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం-సీఎం చంద్రబాబు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

Big Stories

Advertisement
×