E-Paper
Advertisement

Tata Sierra 2025: సరికొత్తగా టాటా సియెర్రా.. జస్ట్ 11 లక్షల నుంచే అందుబాటులోకి!

Tata Sierra 2025: సరికొత్తగా టాటా సియెర్రా.. జస్ట్ 11 లక్షల నుంచే అందుబాటులోకి!

టాటా మోటార్స్ ఐకానిక్ సియెర్రా మోడల్ 1990లలో దేశీ మార్కెట్లో ఫస్ట్ లైఫ్‌ స్టైల్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. 2003లో ఆగిపోయిన ఈ మోడల్ ఇప్పుడు సరికొత్తగా మరోసారి మార్కెట్‌ లోకి అడుగు పెట్టింది.  మోడరన్ డిజైన్‌, అధునాతన టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. ఈ క్రేజీ SUV ఇవాళ లాంచ్ అయ్యింది. బుకింగ్స్ డిసెంబర్ 16 నుంచి మొదలుకాగా, డెలివరీలు జనవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సరికొత్త సియొర్రా Hyundai Creta, Kia Seltos, Maruti Victoris లాంటి మిడ్ సైజ్ SUVలతో పోటీ పడుతుంది.

ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?  

సియెర్రా 2025 మోడల్ పూర్తి వేరియంట్ వైజ్ ధరలు డిసెంబర్ తొలివారంలో కంపెనీ ప్రకటించనుంది. ప్రస్తుతం బేస్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ Sierra Smart Plus (పెట్రోల్): 1.5L NA పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ధర రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది. బేసిక్ వేరియంట్, మంచి మైలేజ్ అందిస్తుంది.

⦿ Sierra Smart Plus (డీజిల్): 1.5L డీజిల్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ధర రూ. 12.94 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. టార్క్ రిచ్, హైవే డ్రైవింగ్‌కు బెస్ట్ గా ఉండబోతోంది.

⦿ Pure / Adventure: 1.5L TGDi టర్బో పెట్రోల్, 6-స్పీడ్  AT మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ధర రూ. 15-20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధునాతన ఫీచర్లు, AWD ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

⦿Accomplished+: 1.5L డీజిల్, 7-స్పీడ్ DCT మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ధర రూ. 18-22 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ స్పేస్, ADAS, పానోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది.

⦿ Sierra EV (ఎలక్ట్రిక్): ఎలక్ట్రిక్ మోటార్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ధర రూ. 20-25 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీ ఉంటుంది. లెవల్-2 ADAS ను కలిగి ఉంటుంది.

సియెర్రా 2025లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్

సియెర్రా 2025లో మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది Tata కొత్త t.idal 2.0 ఆర్కిటెక్చర్‌ బేస్ చేసుకుని రూపొందించబడింది. దేశంలో ఫస్ట్ Ethernet-ఆధారిత ICE వెహికల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.

⦿ 1.5L NA పెట్రోల్: 1498 cc సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 105 bhp పవర్, 145 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ట్రాన్స్ మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది. లీటర్ కు 18-20 కి. మీ మైలేజ్ వస్తుంది.

⦿1.5L TGDi టర్బో పెట్రోల్: 1498 cc సామర్థ్యంతో 158 bhp / 255 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ AT  ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. లీటరుకు 15-18 కి. మీ మైలేజ్ ఇస్తుంది.

⦿1.5L డీజిల్: 1497 cc ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 116 bhp / 260 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. 20-22 కి.మీ మైలేజీ ఇస్తుంది.

⦿ ఎలక్ట్రిక్ (EV): 160+ bhp పవర్ ఉత్పత్తి చేతుంది.  సింగిల్-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.  400+ కి.మీ నరేంజ్ ఇస్తుంది.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే 5-స్టార్ GNCAP రేటింగ్  ను కలిగి ఉంది. 6 ఎయిర్‌ బ్యాగ్స్, ABS+ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్-2 ADAS (EVలో)ను కలిగి ఉంటుంది. .

డిజైన్ మరియు ఫీచర్లు

⦿ ఎక్స్‌ టీరియర్: ఐకానిక్ బాక్సీ సిలూయెట్, ఆల్పైన్ గ్లాస్ రూఫ్, 19 ఇంచ్ అలాయ్ వీల్స్, ఫుల్-LED లైట్స్, కనెక్టెడ్ LED లైట్ బార్, రియర్ స్పాయిలర్ ను కలిగి ఉంటుంది.

⦿ కలర్ ఆప్షన్లు: 6  ఎక్స్‌ టీరియర్ రంగుల్లో అందుబాటులో ఉంది. Coorg Clouds, Pure Grey, Pristine White, Bengal Rouge, Munnar Mist, Andaman Adventure. 3 ఇంటీరియర్ థీమ్స్ ను కలిగి ఉంటుంది.

⦿ ఇంటీరియర్: 5-సీటర్, ప్రీమియం క్యాబిన్. ట్రిపుల్ స్క్రీన్ సెటప్ స్క్రీన్లు. MeSpace, Relax మోడ్స్, 5G కనెక్టివిటీ, IP-ఆధారిత టెలిమాటిక్స్ ను కలిగి ఉంటుంది.

⦿ కీ ఫీచర్లు: పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ చార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ AC, రియర్ సన్‌ షేడ్స్. రిమోట్ కమాండ్స్, OTA అప్‌డేట్స్. ఆడ్వెంచర్ వేరియంట్‌ లో ఆఫ్ రోడ్ మోడ్స్, రూఫ్ రైల్స్ ను కలిగి ఉంటుంది.

Read Also: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×