E-Paper
Advertisement

Tata Curvv EV: టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV.. సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ టూ బెంగళూరు..?

Tata Curvv EV: టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV.. సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ టూ బెంగళూరు..?
Advertisement

Tata Curvv EV give 500km Milage with Single Charge: దేశంలోని ప్రముఖ వాహన తయారీ కంపెనీల్లో టాటా కూడా ఒకటి. కంపెనీ ఎస్‌యూవీల డిమాండ్ దృష్టిలో ఉంచుకొని త్వరలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Curvv EVని తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇందులో పవర్‌ఫుల్ బ్యాటరీ, మోటార్‌ను తీసుకురానుంది. ICE వెర్షన్‌లో టాటా కర్వ్‌ను చూడొచ్చు. దాని రేంజ్ ఎంత ఉంటుంది? లాంచ్ ఎప్పుడు? తదితర విషయాలను తెలుసుకోండి.

ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా టాటా కర్వ్ EVని త్వరలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌ని కంపెనీ ఫిబ్రవరి 2024లో జరిగిన భారత్ మొబిలిటీలో షోలో ప్రదర్శించింది. ఇది ICE వెర్షన్‌లో కూడా తీసుకురానుంది. అయితే కంపెనీ దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ముందుగా తీసుకొచ్చే అవకాశం ఉంది.ఈ కూపే  ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం కంపెనీచే టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే దీని ఎలక్ట్రిక్ వేరియంట్ లాంచ్ చేస్తుంది.

Advertisement

Also Read: హోండా షైన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే రివ్యూ‌పై ఓ లుక్కేయండి!

టాటా కర్వ్ కూపే SUV డిజైన్ దాని ICE వేరియంట్ ఎలక్ట్రిక్ పంచ్‌ని పోలి ఉంటుంది. ఇది తక్కువ గ్రిల్, స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్, క్లామ్‌షెల్ షేప్ హుడ్ కలిగి ఉంటుంది. ఇందులో స్పోర్టీ అల్లాయ్ వీల్స్, LED టెయిల్ లైట్లతో పాటు కర్వ్ లాంటి కూపే స్టైల్ రూఫ్‌లైన్ ఉంటుంది.

Advertisement

ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ కూపే స్టైల్ SUVలో కంపెనీ నెక్సాన్ కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్, మోటారును అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత దాదాపు 500 కిలోమీటర్లు నడపవచ్చు. ఇది 50kWh కెపాసిటీ గల బ్యాటరీ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఇది కాకుండా SUV దానిలో అమర్చిన మోటారు నుండి 116 కిలోవాట్ల పవర్ రిలీజ్ చేస్తుంది. ఇది లిక్విడ్ కూల్డ్, IP-67 రేటింగ్ కెపాసిటీ బ్యాటరీ, మోటారుతో రావచ్చు. సింగల్ చార్జ్ తో సుమారు 500 కిలో మీటర్ల మైలేజ్ అంటే.. ఒక చార్జ్ తో మనం హైదరాబద్ నుండి బెంగుళూరు వరకు వెల్లోచ్చని అర్థం!

Also Read: ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది కొనాలి?

కంపెనీ నుండి కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా EV, మారుతి EVX, సిట్రోయెన్ బసాల్ట్ EV వంటి త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ SUVలతో నేరుగా పోటీపడుతుంది. సమాచారం ప్రకారం కంపెనీ ఈ SUV ని పండుగ సీజన్లో విడుదల చేయవచ్చు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×