BigTV English

Supreme Court Serious : ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం సీరియస్.. జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

Supreme Court Serious : ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం సీరియస్.. జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

Supreme Court Serious on AP Government : ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. జేపీ పవర్ వెంచర్స్ వర్సెస్ నాగేంద్రకుమార్ కేసు విచారణ సందర్భంగా.. ఇసుక అక్రమ తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేసింది. వెంటనే పర్మిషన్ లేని ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.


ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతపై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. ఎన్నికల సమయం కాబట్టి కాస్త సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలే ముఖ్యమని తెలిపింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని సూచించింది.

Also Read : నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు: చంద్రబాబు


దీనిపై స్టేటస్ రిపోర్టును ఫైల్ చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. పర్యావరణశాఖ అనుమతి లేనిదే ఇకపై ఇసుక తవ్వకాలు జరపవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×