BigTV English

Honda Activa Vs TVS Jupiter: యాక్టివా, జూపిటర్.. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది కొనాలి?

Honda Activa Vs TVS Jupiter: యాక్టివా, జూపిటర్.. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది కొనాలి?

Honda Activa Vs Tvs Jupiter Which one is Best..?: దేశీయ ఆటో మార్కెట్‌లో 110 సీసీ సెగ్మెంట్లో అనేక స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. TVS, Honda నుండి వస్తున్న ఈ రెండు స్కూటర్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఇంజన్ కెపాసిటీ ఎంత?  వాటి ధర ఎంత? వాటిని కొనుగోలు చేయవచ్చో లేదో ఫుల్ రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.


ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన యాక్టివాను 110 సీసీలో అందిస్తోంది. ఈ స్కూటర్ దేశంలోనే అత్యధికంగా ఇష్టపడే స్కూటర్. ఇందులో 109.51 సీసీ ఫోర్‌స్ట్రోక్ ఎస్‌ఐ ఇంజన్‌ను కంపెనీ అందించింది. దీని కారణంగా స్కూటర్ 5.77 కిలోవాట్ల పవర్, 8.90 న్యూటన్ మీటర్ల టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. జూపిటర్‌ని కూడా ఈ విభాగంలో టీవీఎస్ ఆఫర్ చేస్తోంది. ఈ టీవీఎస్ స్కూటర్‌లో, కంపెనీ 109.7 సీసీ ఫోర్ స్ట్రోక్, సివిటిఐ టెక్నాలజీ ఫ్యూయల్ ఇంజన్ కలిగి ఉంది. దీని కారణంగా స్కూటర్ 5.8 కిలోవాట్ల పవర్, 8.8 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read: హోండా షైన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే రివ్యూ‌పై ఓ లుక్కేయండి!


ఈ రెండు బైకుల ఫీచర్ల విషయానికి వస్తే హోండా యాక్టివా 110లో ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, డబుల్ లిడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, సైలెంట్ స్టార్ట్, ఫ్యూయల్ ఇంజెక్షన్, మల్టీ ఫంక్షన్ యూనిట్, అనలాగ్ స్పీడోమీటర్ అలాగే ఆరు కలర్ ఆప్షన్‌లను అందిస్తుంది. TVS జూపిటర్‌లో LED హెడ్‌ల్యాంప్, ఎకనోమీటర్, యాంటీ-స్కిడ్ సీట్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, అడ్జస్ట్‌బుల్ చేయగల గ్యాస్ ఛార్జ్ వెనుక సస్పెన్షన్, పోర్టబుల్ మొబైల్ ఛార్జింగ్, ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: దేశంలో సూపర్ బైక్స్ క్రేజ్.. తగ్గిందా? పెరిగిందా?

హోండా యాక్టివాను కంపెనీ రెండు వేరియంట్లలో అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.76234 నుండి ప్రారంభమవుతుంది. హెచ్ స్మార్ట్ వేరియంట్ ధర రూ. 82,234 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. TVS జూపిటర్ ధర రూ.73340 నుండి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్‌ను రూ. 89,748 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×