E-Paper
Advertisement

టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్నేళ్లకు తీసుకోవాలి?.. ఈ తప్పులు చేయొద్దు

టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్నేళ్లకు తీసుకోవాలి?.. ఈ తప్పులు చేయొద్దు
Advertisement

Term Insurance: మనం లేకపోయినా.. మన ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులు రాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కాస్త ఎక్కువగా ఆలోచించి 100 ఏళ్లకు తీసుకుంటాం. కానీ అంత ఎక్కువ కాలానికి టర్మ్ ఫ్లాన్ అవసరం లేదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. టర్మ్ పాలసీ డిపెన్డెంట్స్ కోసం తీసుకుంటాం. మనం 60-65 వచ్చే వరకు మన పిల్లలకు మ్యారేజ్ అవ్వడం లేదా వాళ్లు లైఫ్ లో సెటిల్ అవుతారు. అంటే మనపై ఆధారపడరు. మనం 100 ఏళ్లకు టర్మ్ పాలసీ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.

అందుకే టర్మ్ పాలసీని 60 లేదా 65 ఏళ్లకు లేదంటే గరిష్టంగా 70 ఏళ్ల వరకే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ టైమ్ కు పాలసీని సిఫార్సు చేస్తాయి.. అంటే 60, 70 దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ రిస్క్ ఉంటుంది. అందుకే కంపెనీలు ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తాయి.

ఉదాహరణకు

Advertisement

25 ఏళ్ల వ్యక్తి 65 ఏళ్ల వరకు టర్మ్ పాలసీ తీసుకుంటే.. ప్రతి సంవత్సరం 15 వేల ప్రీమియం కట్టాలి. అదే 25 ఏళ్ల వ్యక్తి 75 ఏళ్ల వరకు పాలసీ తీసుకుంటే ప్రీమియం 21 వేల వరకు ఉంటుంది. ఇక్కడ ప్రీమియం పెరగడానికి కారణం ఆ వ్యక్తి వయస్సు. వయస్సు పెరిగితే వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తాయి. అంటే మీరు ప్రతి సంవత్సరం రూ.6 వేలు ఎక్కువ చెల్లిస్తారు. పదేళ్లకు 21,000*10 అంటే రూ.2.10 లక్షల ప్రీమియం కట్టాలి. అందుకే టర్మ్ ప్లాన్ తీసుకునే ముందు ఈ విషయాలు చెక్ చేసుకోండి. 100 ఏళ్ల టర్మ్ పాలసీలతో అంత ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు.

Also Read: టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి..? ఏది కరెక్ట్ టైం..?

Related News

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×