Vijay Cars : ఎవరి అంచనాలకి అందకుండా ‘తమిళక వెట్రి కజగం’పార్టీ పెట్టి ఊహించని రీతిలో సీయం సీటుకి చేరువయ్యాడు దళపతి విజయ్.దీంతో విజయ్ కి సంబందించిన ప్రతీ విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఇదే క్రమంలో విజయ్ వాడుతున్న లగ్జరీ కార్ల నంబర్ ప్లేట్ల వెనుక దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.
అన్ని వెహికల్స్ కీ ఒకే నంబర్
ఇక ఈ మధ్యే తన లగ్జరీ కార్ అయిన రోల్స్ రాయిస్ అమ్మేసి కొత్తగా కొన్న మూడు కార్లు కొన్న విజయ్ ఆ మూడింటికి ఒకే నెంబర్ వాడుతున్నారు.అవును..కొన్న BMW i7 ఎలక్ట్రిక్ కారుకి TN 14 AH 0277,లెక్సస్ LM కి TN 14 AL 0277,టయోటా వెల్‌ఫైర్ కి TN 14 AM 0277 అంటూ ఒకే నంబర్ ఉండటం విశేషం. అంతే కాదండోయ్.. టీవీకే పార్టీ ఎలక్షన్స్ ప్రచారానికి వాడే బస్సుకు కూడా TN 14 AS 0277 నంబరే వాడటం మరో విశేషం.ఇలా విజయ్ వాడే ప్రతీ వెహికిల్ కి 0277 అనే నెంబర్ ఉండటంతో అసలు ఈ నెంబర్ వెనుకున్న ఆ మిస్టరీ ఎంటా అంటూ ఆరాతీసే పనిలో పడ్డారు నెటిజన్లు.
also read :అమీర్ ఖాన్ చేతిలో మరో ‘క్లాసిక్’.. ‘లగాన్’ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా?
ఈ నెంబర్ వెనుక ఒక బలమైన ఎమోషన్
అయితే ఈ నెంబర్ వాడటం వెనుక ఒక బలమైన ఎమోషన్ దాగున్నట్టు తెలుస్తుంది. ‘0277’ అంటే వాస్తవానికి 14-02-77 అనే తేదీని సూచిస్తుంది. అంటే 1977 ఫిబ్రవరి 14వ తేదీ. ఈ రోజు విజయ్ చెల్లెలు విద్యా చంద్రశేఖర్ పుట్టినరోజు.కానీ రెండేళ్ళ వయసు ఉన్నప్పుడే విద్యా చనిపోయింది. అందువల్ల తన చెల్లి జ్ఞాపకాలని ఎప్పుడు తనతోనే ఉంచుకోవాలని విజయ్, తాను నడిపే ప్రతి కారులోనూ ఈ తేదీని ఒక ఎమోషనల్ గుర్తుగా ఉపయోగిస్తున్నారట. అంతకుముందు తన చెల్లెలు విద్యా పుట్టిన రోజుకి గుర్తుగా ఆయన వాడిన రోల్స్ రాయిస్ నంబర్ ‘0014’ ని వాడి తన చెల్లిపై ప్రేమని చాటుకోవడం విశేషం.
తన చెల్లెలిపై ఉన్న ఆ అపారమైన ప్రేమే
అంతకుముందు గడుగ్గాయ్ లా ఉన్న విజయ్ తన చెల్లెలు చనిపోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయాడని పలు ఇంటర్వ్యూల్లో కన్నీరు పెట్టుకున్నారు తండ్రి చంద్రశేఖర్.ఇక విజయ్ సినిమాల్లో ఎక్కువా సిస్టర్ సెంటి మెంట్ ఉండటానికి కారణం కూడా తన చెల్లెలిపై ఉన్న ఆ అపారమైన ప్రేమేనట. ముఖ్యంగా ‘తిరుపాచి’ (తెలుగులో అన్నవరం), ‘శివకాశి’ వంటి సినిమాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని విజయ్ పండించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
చెల్లెలి గుర్తుగా ఎన్నో చారిటీలు
కేవలం కార్ల నంబర్లు మాత్రమే కాదు.తన చెల్లెలి గుర్తుగా ఎన్నో చారిటీలని విజయ్ నిర్వహిస్తుండటం విశేషం.ఇక ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ తమ నిర్మాణ సంస్థకు “విద్యా-విజయ్ ప్రొడక్షన్స్” (V.V. Creations) అని పేరు పెట్టారు. ఈ బ్యానర్ పైనే విజయ్ హీరోగా ‘నాలయ తీర్పు’, ‘నెంజినిలే’, ‘ఆది’ వంటి సినిమాలు తెరకెక్కిన సంగతి తెల్సిందే.
మొత్తానికి విజయ్ వాడుతున్న ఆ 0277 వెనుక చెల్లెలి జ్ఞాపకాలున్నాయన్న మాట.!
also read :‘గేట్లు మూయండిరా’.. నాగ్ 100వ సినిమా లీక్డ్ సీన్స్ చూశారా?