E-Paper
Advertisement

చేతులు మారిన శర్వా శ్రీను వైట్ల మూవీ… కథ పై నమ్మకం తగ్గిందా?

చేతులు మారిన శర్వా శ్రీను వైట్ల మూవీ… కథ పై నమ్మకం తగ్గిందా?
Advertisement

Sharwanand -Sreenu Vaital: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకులలో సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల(Sreenu Vaitla) ఒకరు. ఈయన డైరెక్షన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దర్శకుడుగా ఒకానొక సమయంలో ఎంతో బిజీగా గడిపిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఈయన చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో ఈయనతో సినిమా చేసే సాహసం ఏ హీరో చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ (Sharwanand)మాత్రం శ్రీను వైట్లకు అవకాశాన్ని కల్పించారు.

తప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్..

ఇలా వీరి కాంబినేషన్లు సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. శ్రీను వైట్లతో శర్వానంద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సాహసమే చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు.ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కథ మొత్తం సిద్ధం అయిన తర్వాత నిర్మాతలు మారినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కమిట్ అయిన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makets)వారు తప్పుకోవడంతో ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించే బాధ్యతలను తీసుకున్నారు.

అనిల్ సుంకర చేతికి శ్రీనువైట్ల శర్వా ప్రాజెక్టు..

Advertisement

మైత్రి మూవీ మేకర్స్ వారు కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కథ నచ్చినటువంటి అనిల్ శంకర(Anil Sunkara) ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు టాలీవుడ్ సమాచారం. మరి ఈ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అరవింద్ స్వామి కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా శ్రీను వైట్లకు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటే ఈయనకు ఇండస్ట్రీలో కెరియర్ ఉంటుందని లేదంటే ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలుస్తోంది.

నారీ నారీ నడుమ మురారితో బ్లాక్ బస్టర్..

Advertisement

ఇక శర్వానంద్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే రెండు సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవల బైకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శర్వానంద్ సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాకు ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు అనిల్ సుంకర ఏకంగా శ్రీనువైట్ల తో చేసే సినిమాని కూడా చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: నాని పని రాక్షసుడు… ట్రోల్స్ చూస్తే టెంపర్ లేచ్చిపొద్ది.. జిమ్ ట్రైనర్ కామెంట్స్ వైరల్!

Related News

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

బిచ్చగాడు ప్లస్ పోకిరి.. పూరి ఐడియా వర్కవుట్ అవుతుందా?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!

Lenin Movie : హే అఖిల్ కంగ్రాట్స్.. ‘లెనిన్’ సక్సెస్ పై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..

‘రావు బహదూర్ ‘ మూవీ పై ప్రియదర్శన్ కామెంట్స్..ఇది అస్సలు ఊహించలేదు బ్రో..!

తెలుగు సినీ చరిత్రలో అత్యంత ఎక్కువ రోజుల షూటింగ్ జరిగిన సినిమా ఏదో తెలుసా?

ఆ అభిమాని నమ్మకాన్ని అయ్యగారు నిలబెట్టేనా ?

Big Stories

Advertisement
×