BigTV English

Right Time for Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి..? ఏది కరెక్ట్ టైం..?

Right Time for Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి..? ఏది కరెక్ట్ టైం..?

Life Insurance Policy,Term Insurance:


Right Time for Life Insurance Policy & Term Insurance: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మన మీద ఆధారపడి జీవించే వాళ్లకోసమే ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. అనుకోని దుర్ఘటనలు ఎదురై కుటుంబ పోషకుడికి ఏదైనా జరిగితే.. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, రోడ్డున పడకుండా టర్మ్ ఇన్సురెన్స్ వారికి ఆర్ధికంగా రక్షణ కల్పిస్తుంది. పాలసీ తీసుకోవడానికి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వ్యక్తి ఆరోగ్య సమస్యల నుంచి చెడు అలవాట్లు, ఉద్యోగ భద్రత వంటి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తారు.

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అందరికీ తేలిక కాదు. ఉద్యోగులు, వ్యాపారులకు తీసుకునే డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్ మెంట్లు, తదితరాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలోని వ్యత్యాసాలను తెలుసుకుందాం.. చాలా మంది ఉద్యోగం చేస్తూ మంచి అవకాశం రాగానే ఏదొక వ్యాపారంలో దిగిపోతారు. ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువ మందికి పాలసీ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుగా ఉద్యోగస్తులు.. సాధారణంగా ఏదైనా పాలసీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సి ఉంటుంది.


Also Read: 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. ఏ మోడల్స్ అంటే..

అలాగే మూడు నెలల శాలరీ, బ్యాంక్ స్టేట్మంట్స్, రెండేళ్ల వరకు ఫైల్ చేసిన ఆదాయ పన్ను వివరాలు ఇస్తే సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు పొందినంత తేలిగ్గా వ్యాపారులు పొందలేరు. ఎందుకంటే వీరి లావాదేవీల సరళి భిన్నంగా ఉంటుంది. ఆదాయం పెట్టుబడి స్థిరంగా ఉండదు. చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్, రెండేళ్లకు సంబంధించిన ఆదాయం, నష్టాన్ని తెలిపే అకౌంట్ ని చూపించాలి. అలాగే రెండేళ్ల ఆదాయపు పన్ను వివిరాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా మొదలు పెట్టిన వారికి ఇవన్నీ ఉండవు కాబట్టి కష్టం అవుతుంది. దీంతో పాలసీ తీసుకోవడం కష్టతరం అవుతుంది. లేదంటే కనీసం 2 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగం మానేసే ముందు ఆ విషయం గురించి ఓ సారి ఆలోచించండి.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×