E-Paper
Advertisement

Gold mining: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. లక్షల టన్నుల గోల్డ్.. ఎక్కడో తెలుసా..?

Gold mining: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. లక్షల టన్నుల గోల్డ్.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Gold mining: బంగారం.. గోల్డ్.. పసిడి.. స్వర్ణం.. ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం.. భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే దానికి ఉండదు. ఇక మగువలు అయితే బంగారం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. జస్ట్ వారికి చిన్నపాటి ధరలో గోల్డ్ గిఫ్ట్ ఇచ్చినా చాలు.. తెగ సంబరపడి పోతుంటారు. పెళ్లికైనా.. ఎంగేజ్‌మెంట్ కు అయినా గోల్డ్ ముచ్చట లేనిది కార్యక్రమం ముందుకెళ్లదు. అది గోల్డ్ కు ఉన్న ఇమేజ్. ప్రస్తుతం బంగారం ధర అక్షరాల లచ్చ రూపాయలుదాటిపోయింది.. అయిన మనం ఊరుకుంటామా..? ఎంత ఉన్నా బంగారం కొనుడే.. పెళ్లిల్లో.. వేడుకల్లో ఆభరణాలు ధరించుడే.. అయితే ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని ఒక్కటి కనుగొనబడింది.. ఆ బంగారం లెక్క ఎంత ఉంటది..? మొత్తం ఎన్ని బంగారు గనులు ఉన్నాయి..? అనే సమాచారం గురించి చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దీని గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..

చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని కున్‌లున్ పర్వతాల క్రింద శాస్త్రవేత్తలు అతిపెద్ద బంగారు గనిని కనుగొన్నారు. సైంటిస్టులు ఈ ప్రాంతంలో 1444 టన్నుల బంగారం నిల్వలను గుర్తించారు. ఈ బంగారు నిల్వల విలువ 192 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. నవంబర్ 2025లో ఈ ఆవిష్కరణ ధృవీకరించారు. ఇది కేవలం భౌగోళిక అంశం కాదు ఇది చైనా ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత వ్యూహాత్మకమైంది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఈ కనుగొన్నారు. బీజింగ్ కు ఇది గొప్ప ఆర్థిక అవకాశాలు సృష్టించగలదు.

Advertisement

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బంగారంపై బిజినెస్ మ్యాన్ ల దృష్టిని పెంచాయి. అక్టోబర్‌లో బంగారు ధరలు ఔన్సుకు 4100 డాలర్ల అపూర్వ స్థాయికి చేరాయి. 2024 ప్రారంభం నుండి ఇది దాదాపు 100 శాతం పెరుగుదల అని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం, ప్రపంచ అస్థిరత సంప్రదాయ ఫియట్ కరెన్సీల నుండి వైదొలగడం వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఇటువంటి కీలక సమయంలో చైనా ఈ భారీ నిక్షేపాన్ని కనుగొనడం అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది చైనా ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది.

చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ నూతన గనిని ధృవీకరించింది. దీనికి దాదంగ్‌గౌ బంగారు గని అని పేరు పెట్టారు. 1949 తరువాత చైనాలో కనుగొనబడిన గనులలో ఇది అతిపెద్దది. ఈ గనిలో 25.86 లక్షల టన్నుల బంగారం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇందులో సగటు ధాతువు గ్రేడ్ టన్నుకు 0.56 గ్రాములు ఉంది. ఈ గని ఉత్పత్తి చైనా ప్రస్తుత బంగారు ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉంది. ఈ ఆవిష్కరణ దాని ఆధిపత్యాన్ని మరింత పెంచుతుంది.

Advertisement

ఈ ఆవిష్కరణ కేవలం పరిమాణం విషయంలోనే ముఖ్యం కాదు. చైనా విస్తృత వ్యూహాన్ని ఇది తెలియజేస్తుంది. బంగారం ఒక వస్తువు మాత్రమే కాదు ఇది ఆర్థిక భద్రతకు ఒక ఆయుధం. ఆర్థిక శక్తి మారుతున్న సంకేతాలను ఇస్తుంది. ఖనిజ వనరుల ఆధిపత్యాన్ని భద్రపరచుకోవడానికి చైనా ఈ విధానాన్ని అనుసరిస్తుంది. గతంలో హునాన్ ప్రావిన్స్‌లోని వాంగు గోల్డ్ ఫీల్డ్‌లో సుమారు 1000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉన్న గనిని కనుగొన్నారు. ఈ కొత్త దాదంగ్‌గౌ ఆవిష్కరణ ఆ రికార్డును అధిగమించింది. చైనా తన ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించే ప్రయత్నంలో ఉంది. ఈ బృహత్తర బంగారు నిల్వలు చైనా అంతర్జాతీయ ఆర్థిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.ఈ బంగారు గని తవ్వకం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఉత్పత్తి లక్ష్యాలు ఎలా ఉంటాయో చైనా త్వరలో ప్రకటించవచ్చు. ప్రపంచ ఆర్థిక వేదికపై చైనా పాత్రను ఈ ఆవిష్కరణ మరింత బలోపేతం చేస్తుంది.

ALSO READ: Chicken Price: కార్తీక మాసం ముగింపు: కళకళలాడుతున్న మాంసం దుకాణాలు.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×