E-Paper
Advertisement

Top 20 News Today: సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్

Top 20 News Today: సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్

1. నిర్మల్ జిల్లాలో మత్స్యకారుల దినోత్సవం

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మత్స్యకారుల ఆరాధ్య దైవం భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యకారులు మరణిస్తే రూ. 5 లక్షలు మాత్రమే వస్తున్నాయని, ఆ ఐదు లక్షలను 20 లక్షలకు పెంచి ఇవ్వాలని కోరారు

2. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ

ఏపీ సీఎం చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో కూడిన లేఖ రాస్తూ అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించారు. ఇందులో భాగంగా ట్రిబ్యునల్‌లో బలంగా వాదనలు వినిపించాలని లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నిండా నిర్లక్ష్యం వహించిందని లేఖలో చెప్పారు.

3. శిశు విక్రయాలపై కలకలం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో శిశు విక్రయాలపై కలకలం రేపింది. 2 రోజులు పసికందును విక్రయించడానికి యత్నించారు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిని, శిశువును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలిసిన వారికే ఇచ్చామని చెబుతోంది శిశువు తల్లి.

4. మంత్రి వాసంశెట్టికి సవాల్

మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సవాల్ విసిరారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. వైసీపీ పాలనలో ఏం జరిగింది.. టీడీపీ పాలనలో ఏం జరిగిందో చర్చిద్దానికి సిద్దమా అని ప్రశ్నించారు. దేశంలో మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 13 వేల 500 రైతులకు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు వేణుగోపాలకృష్ణ.

5. యువతి ప్రేమకోసం.. నడరోడ్డుపై యువకులు గొడవ

ఓ యువతి ప్రేమకోసం.. యువకులు గొడవ పడ్డారు. నడిరోడ్డుపై ఇద్దరూ తన్నుకున్నారు. విశాఖలోని సిరిపురం అతిథి గృహం వద్ద ఘటన వెలుగుచూసింది. అయితే యువతి ఇద్దరితో ప్రేమాయణం నడపటమే యువకుల మధ్య గొడవకు దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తుంది.

6. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వం మాట తప్పిందన్నారు. 42శాతం రిజర్వేషన్ల అమలును మర్చిపోయారా అంటూ నిలదీశారు. బీసీల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోమంటోన్న ఎంపీ ఆర్.

7. నిర్మల్ జిల్లాలో అగ్ని ప్రమాదం.. బేకరీలో మంటలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంచిర్యాల రోడ్డుపై గల బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు జిల్లా ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్.

8. నాగర్‌కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా పల్కపల్లిలో గంజాయి కలకలం రేపింది. మత్తుకు బానిసై గ్రామానికి చెందిన నాగనులు మధు గంజాయి కొనలేక తన ఇంటి పెరట్లోనే రెండేళ్లగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు 20గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

9. చిత్తూరులో విషాదం.. 10 నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య

చిత్తూరు జిల్లా వెళగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 10 నెలల చిన్నారితో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. గ్రామ సమీపంలోని చెక్‌ డ్యామ్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి ఆనారోగ్యంతో బాధపడుతుండటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

10. అనకాపల్లి జిల్లాలో కారు బీభత్సం

అనకాపల్లి జిల్లా చోడవరంలో కారు బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించడంతో కారును అడ్డదిడ్డంగా నడిపాడు కారు డ్రైవర్. ఈ తరుణంలో ఆటోను, బైక్ ఢీకొట్టింది కారు. అనంతరం పెట్రోల్ బంక్ వద్ద కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. కారులో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. కారులోని ఒక స్మగ్లర్ పంట పొలాల్లోకి పరుగులు తీయడంతో వెంటపడి పట్టుకున్నారు పోలీసులు.

11. వినూత్న ఆలోచన

నిర్మల్ జిల్లాలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించి పంట మార్పిడి చేశాడు. ముథోల్ మండలంలోని కోలిగల్లీ కాలనీకి చెందిన పోతన్న తనకున్న 20 గుంటల భూమిలో వరి పంట వేశాడు. వరి పంట కోతకు రావడంతో పొలాన్ని కోయించి కుప్ప వేశాడు. చిన్న విస్తీర్ణం కావడంతో ట్రాక్టర్‌తో మార్పిడి చేయడం కుదరలేదు. దీంతో పోతన్న స్నేహితులు వినూత్నంగా ఆలోచించి తమ బైక్‌లతో ఇలా మార్పిడి చేశారు.

12. మంత్రి పొన్నం పరామర్శ

సిరిసిల్ల జిల్లాలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ బాలరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో పరామర్శించారు. డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు పొన్నం.

13. ఐచర్ వాహనం బోల్తా.. ఒకరు మృతి

నంద్యాల జిల్లా నందికొట్కూరులో రోడ్డు ప్రమాదం జరిగింది.తూడి చెర్ల నుంచి మొక్కజొన్న సంచులతో వస్తున్న ఐచర్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు, నందికొట్కూరు హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

14. జనగామ జిల్లాలో ఏసీబీ తనిఖీలు

జనగామ జిల్లా పాలకుర్తిలో ఇరిగేషన్‌ అధికారి ఏసీబీకి చిక్కారు.10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. ఇరిగేషన్ డీఈ సంధ్యారాణి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వద్ద 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇరిగేషన్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్ సురేష్‌ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

15. నిద్రపోతున్న టీచర్

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే నిద్రిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి తరగతి గదిలోనే నిద్రపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

16. గుప్తనిధుల కలకలం

ములుగు జిల్లా మంగపేటలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంగపేటకు చెందిన నలుగురు సభ్యులు.. మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలోని.. ఓ ఇంటి పరిసరాల్లో గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. అక్కడి నుంచి గుప్త నిధి తెచ్చి స్వగ్రామంలో పాతి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

17. ట్రంప్ టారిఫ్‌లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు అనుకున్నట్లు వాణిజ్య లోటును తగ్గించలేదని CBO తాజా నివేదిక వెల్లడించింది. ఈ సుంకాలతో వాణిజ్య లోటు నాలుగు ట్రిలియన్ డాలర్లు తగ్గుతుందని తొలుత అంచనా వేసింది. కానీ వాస్తవంగా మూడు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. దిగుమతి అవుతున్న వస్తువుల ధరల మోతతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వాదిసున్నారు CBO.

18. విజయ్ ప్రచారం.. అనుమతి లేదు

తమిళనాడు కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. డిసెంబర్ 4న సేలంలో జరగాల్సిన ఈ కార్యక్రమం కోసం సమర్పించిన చేసిన దరఖాస్తును తిరస్కరించారు. భవిష్యత్తులో విజయ్ ప్రజా సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

19. వివాహ బంధంలోకి మహిళ క్రికెటర్

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన వివాహం త్వరలోనే జరగనుంది. తనకు నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని ఆమె ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా ప్రకటించింది. పలాశ్ ముచ్చల్‌ను పెళ్లిచేసుకోబోతున్న స్మృతి.. తన నిశ్చితార్ధపు ఉంగరాన్ని చూపించింది. వివాహం ఈ నెల 23న జరగనుందని సమాచారం.

20. ఆసక్తికర విషయాలు

హీరో రామ్ పోతినేని, మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉపేంద్ర ఆసక్తికర విషయం చెప్పారు. ఆంధ్ర కింగ్ పాత్ర తాను లేదా రామ్ పోతినేని కాదని, సినిమాలో మరో వ్యక్తి ఉన్నాడని ఉపేంద్ర ప్రకటించారు. ఈ ట్విస్ట్‌తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×