ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (APMSRB) నిరుద్యోగ నిపుణులకు శుభవార్త అందించింది. ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద, హోమియోపతి కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొత్తం 59 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 30 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 29 ఉన్నాయి. ఆయుర్వేద అలాగే హోమియోపతి విభాగాల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు తమ అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. బోధనా రంగంలో అనుభవం ఉన్న వారికి ఇదొక చక్కని అవకాశంగా నిలవనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 59
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పీజీ (Post Graduation) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు పోస్టుల నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం పాటు బోధనా రంగంలో అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.
వయస్సు: వయోపరిమితి విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి అభ్యర్థుల వయసు 60 ఏళ్లు మించకూడదు. సీనియర్ నిపుణులకు సైతం అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఈ వయోపరిమితిని నిర్ణయించింది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నెలకు ఆకర్షణీయమైన గౌరవ వేతనాన్ని అందిస్తోంది. ప్రొఫెసర్ హోదాలో ఎంపికైన వారికి నెలకు రూ. 80,910 చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో నియమితులైన వారికి రూ. 65,360 వేతనం లభిస్తుంది.పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన సాగే ఈ నియామకాలు మెరిట్ ఆధారంగానే జరుగుతాయి.
సెలెక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సహా దివ్యాంగులకు రూ. 1000 గా ఫీజు నిర్ణయించారు.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 26, 2026 లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు APMSRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://apmsrb.ap.gov.in/
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9195 కానిస్టేబుల్ ఉద్యోగాలకు.. నేటి నుంచే అప్లికేషన్ ప్రారంభం