E-Paper
Advertisement

2024 Upcoming Toyota Cars: టయోటా నుంచి మూడు కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఉంటది బాసు.. లాంచ్ ఎప్పుడంటే..?

2024 Upcoming Toyota Cars: టయోటా నుంచి మూడు కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఉంటది బాసు.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement

2024 Upcoming Toyota Cars: దేశీయ కార్ల లవర్స్‌‌కు శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కొత్త కార్లను మార్కెట్‌లో విడుదల చేయనుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ TKM రాబోయే 18 నెలల్లో 3 కొత్త SUVలను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఒకటి సరికొత్త ఎలక్ట్రిక్ SUV, ఇది మారుతి సుజుకి EVX ఆధారంగా రూపొందించబడింది. ఇది కాకుండా రెండు హైబ్రిడ్ SUVలను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.  టయోటామొదటి ఎలక్ట్రిక్ SUV 2025 సెకండ ఫేస్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇది గతేడాది ప్రవేశపెట్టిన అర్బన్ SUV కాన్సెప్ట్ నుంచి తీసుకొస్తున్నారు.

Toyota Fortuner Mild Hybrid Electric Vehicle
టయోటా ఫార్చ్యూనర్ రాబోయే మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (MHEV) వేరియంట్ 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ టెక్నాలజీ అదనపు పవర్, టార్క్ అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న GD సిరీస్ డీజిల్ ఇంజిన్‌ల పనితీరును ప్రత్యేకంగా మెరుగుపరుస్తుంది. అదనంగా 48-వోల్ట్ సిస్టమ్ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయిత, టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

Advertisement

Also Read: తిరుగులేని రారాజుగా హోండా మోటర్స్.. అమ్మకాల్లో రికార్డులే రికార్డులు!

Toyota Electric SUV
టయోటా తన మొదటి ఎలక్ట్రిక్ SUV 2025 సెకండ్ ఫేస్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. దీని డిజైన గత సంవత్సరం ప్రవేశపెట్టిన అర్బన్ SUV కాన్సెప్ట్ నుండి తీసుకొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ 27PL ఇంటర్నల్ ప్లాట్‌ఫారమ్, డెరివేటివ్‌లతో సహా మారుతి సుజుకి eVXతో షేర్ చేసుకున్నట్లుగా ఉంటుంది. ఇది కాకుండా ఇందులో ADAS సూట్, అనేక భద్రతా ఫీచర్లను చూడొచ్చు.

Advertisement

Also Read: మైండ్ బ్లోయింగ్ కలర్‌తో మహీంద్రా బ్లేజ్ ఎడిషన్‌.. ధర ఎంతంటే?

7 seater Toyota Hyryder
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్  7-సీటర్ వెర్షన్ 2025 ప్రారంభంలో లేదా మధ్యలో విడుదల చేయనుంది. ఇది MG హెక్టర్ ప్లస్, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజార్ వంటి ఇతర మూడు SUVలతో పోటీపడుతుంది. స్టాండర్డ్ మోడల్స్ నుండి వేరు చేయడానికి దీనికి కాస్మెటిక్ అప్‌డేట్‌లతో పాటు కొత్త ఫీచర్లును తీసుకొస్తారు. అయితే సుపరిచితమైన 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌లు ఇందులో ఉంటాయి.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×