Big Stories

Tips for AC Buying: ఆన్‌లైన్‌లో AC కొనుగోలు చేసేప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.. లేదంటే మోసపోతారు..!

AC Buying Guide: వేసవి కాలం ప్రారంభమైంది. కాబట్టి చాలా మంది ప్రజలు వేడి నుండి తప్పించుకోవడానికి ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల ఎండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో ఏసీల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. అయితే మీరు కూడా కొత్త ఏసీని కొనాలని చూస్తున్నారా?  ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో వెతికేస్తున్నారా నిజానికి ఆన్‌లైన్‌లో ఏసీ కొని చాలా మంది మోసపోతున్నారు. మీరు ఏసీని కొనుగోలు చేసేప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.

- Advertisement -

ఆన్‌లైన్‌లో ఏసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏసీని కొనుగోలు చేస్తున్న వెబ్‌సైట్ నిజమైనదా కాదా అని చెక్ చేయండి. ఆన్‌లైన్‌లో ఏసీ కొనుగోలు చేసే సమయంలో చాలా మంది నకిలీ వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో,ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే ఆన్‌లైన్‌లో ACని కొనుగోలు చేయండి.

- Advertisement -

వేసవి కాలంలో ACని కొనుగోలు చేసే ముందు ఆన్‌లైన్ సెల్లర్ సమాచారాన్నిచెక్ చేయండి. ఆ సెల్లర్‌కు ఎంత మంది రేటింగ్ ఇచ్చారో కూడా చూడండి. రేటింగ్‌లు చాలా తక్కువగా ఉంటే లేదా చెడ్డగా ఉంటే ఆ ఆన్‌లైన్ సెల్లర్ నుండి AC కొనుగోలు చేయవద్దు. దీనితో పాటు మీరు రేటింగ్‌లను చదవడం ద్వారా కొంత సమాచారాన్ని కూడా పొందుతారు.

Also Read: అమాజ్‌ఫిట్ నుంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌వాచ్.. అబ్బబ్బ ఏమి ఫీచర్లు!

ఆన్‌లైన్ సైట్ నుండి ACని కొనుగోలు చేసే ముందు మోడల్, దాని ఫీచర్‌లను సరిగ్గా చూడండి. ఇందుకోసం మీరు ఇతర సైట్‌ల సహాయం తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు ప్రొడక్ట్ గురించి నిజమైన సమాచారాన్ని తెలుసుకుంటారు.

ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఆఫర్‌లు అందుబాటులో ఉండటం తరచుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ ఆఫర్ ఉండదు. ఆన్‌లైన్ సైట్‌లలో లభించే నకిలీ తగ్గింపులు, ఆఫర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఇతర సైట్‌‌లో చూడటం ద్వారా నిజమైన ఆఫర్లను చూడొచ్చు.

ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో చెల్లింపు చేయడానికి ముందు మీరు ఆన్‌లైన్‌లో ఏసీని కొనుగోలు చేసే సమయంలో పేమెంట్ చేయడానికి సురక్షితమైనదో కాదో చూడండి. చెల్లింపు సమయంలో ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి.

Also Read: 12GB RAM ఫోన్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు!

మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ACని కొనుగోలు చేయబోతున్నట్లయితే, కొనుగోలు చేసే ముందు, ఆ వెబ్‌సైట్ రీఫండ్, రిటర్న్ పాలసీ గురించి సరైన సమాచారాన్ని తెలుసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు తీసుకున్న ప్రోడక్ట్ మంచిది కాదని తేలితే వెనక్కి ఇచ్చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ACని కొనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వారంటీతో పాటు సర్వీస్ గురించిన మొత్తం సమాచారాన్ని చూడండి. వారంటీ ఎంతకాలం ఉంది, సర్వీస్‌కు ఏవైనా ఛార్జీలు ఉన్నాయో లేదో సరిగ్గా చెక్ చేసి కొనుగోలు చేయండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News