Big Stories

Mahindra XUV700 Blaze Edition: మైండ్ బ్లోయింగ్ కలర్‌తో మహీంద్రా బ్లేజ్ ఎడిషన్‌.. ధర ఎంతంటే..?

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ SUV XUV700కి కొత్త బ్లేజ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఇది లోపల బయట బ్లాక్డ్-అవుట్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో కొత్త మ్యాట్ రెడ్ ఎక్స్‌టీరియర్ షేడ్‌ను,  లోపల రెడ్ హైలైట్‌లతో ఆల్-బ్లాక్ సీట్ పొందుతుంది. XUV700 బ్లేజ్ ఎడిషన్ టాప్-స్పెక్ AX7L 7-సీటర్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

ఇది పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ వెర్షన్‌లలో ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్‌లతో లభిస్తుంది. SUV రూపకల్పనలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ, ఇది ఇప్పుడు ఫ్రంట్ గ్రిల్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ORVMలు మరియు బ్లాక్ రూఫ్ వంటి బ్లాక్-అవుట్ స్టైలింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

- Advertisement -

XUV700 బ్లేజ్ ఎడిషన్ టాప్-స్పెక్ AX7L 7-సీటర్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో ఆటోమేటిక్, మాన్యువల్ వేరియంట్‌లతో తీసుకొస్తున్నారు . దీని ధర రూ. 24.24 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.మహీంద్రా కొత్త బ్లేజ్ వేరియంట్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

Also Read: ఈ ఏడాది లాంచ్ కానున్న క్యూటెస్ట్ కార్లు ఇవే..!

SUV డిజైన్‌లో ఎటువంటి మార్పులు లేనప్పటికీ, ఇది ఇప్పుడు ఫ్రంట్ గ్రిల్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ORVMలు, బ్లాక్ రూఫ్ వంటి బ్లాక్-అవుట్ స్టైలింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. ఈ స్టైలింగ్ ఎలిమెంట్స్ కొత్త మాటీ బ్లేజ్ రెడ్ ఎక్స్‌టీరియర్ పెయింట్‌తో తీసుకొచ్చారు. అదనంగా ప్రత్యేక ఎడిషన్‌గా సులభంగా గుర్తించడం కోసం ‘బ్లేజ్’ నేమ్‌ప్లేట్ ముందు ప్రత్యేకమైన డిజైన్‌ను తీసుకొచ్చారు.

లోపలి భాగంలో XUV700  ప్రత్యేక ‘బ్లేజ్’ ఎడిషన్ బ్లాక్ లెథెరెట్ సీట్‌తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను పొందుతుంది. AC వెంట్స్, సెంటర్ కన్సోల్ చుట్టూ రెడ్ కలర్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి. అయితే స్టీరింగ్ వీల్ సీట్లపై రెడ్ కలర్ స్టిచెస్ ఉన్నాయి.

Also Read: బజాజ్ నుంచి ప్రపంచంలోనే తొలి CNG బైక్.. జూన్ 18న లాంచ్

XUV700  ‘బ్లేజ్’ వేరియంట్‌లో మహీంద్రా ఎటువంటి కొత్త ఫీచర్లను తీసుకురాలేదు. ఇది టాప్-ఎండ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెమరీ ఫంక్షన్, వెల్‌కమ్ ఫీచర్‌తో 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్-జోన్ AC సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉంటాయి.

XUV700 ఈ వేరియంట్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX యాంకర్లు, TPMS,  360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా ఇది అడాస్ సూట్‌ను కూడా పొందుతుంది. దీని ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News