E-Paper
Advertisement

TVS Jupiter 125 CNG Scooter: టీవీఎస్ నుంచి కొత్త CNG వెహికల్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

TVS Jupiter 125 CNG Scooter: టీవీఎస్ నుంచి కొత్త CNG వెహికల్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
Advertisement

TVS Jupiter 125 CNG Scooter Coming Soon: ప్రస్తుతం వాహన ప్రియులు ఎక్కువగా సీఎన్‌జీ వాహనాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 బైక్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్‌గా పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో కంపెనీ నడవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ సీఎన్‌జీతో నడిచే స్కూటర్‌పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. టీవీఎస్ మోటార్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశీయంగా కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బైక్‌లు, స్కూటర్లకు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది.

ఈ కారణంతోనే టీవీఎస్ మోటార్ కంపెనీ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మాదిరిగానే సీఎన్‌జీతో నడిచే స్కూటర్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ నివేదిక నెట్టింట వైరల్ అవుతోంది. ఆ నివేదిక ప్రకారం.. హోసూర్ ఆధారిత తయారీదారు గత కొంతకాలంగా CNG, పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలపై పని చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇందులో భాగంగానే TVS ఇప్పటికే CNGతో నడిచే ఇంజన్‌ను డెవలప్ చేసిందని తెలుస్తుంది.

Advertisement

అయితే అలా డెవలప్ చేసిన ఇంజిన్‌ను ఇప్పుడు TVS జూపిటర్ 125కి జత చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది. అయితే ఇది బజాజ్ ఫ్రీడమ్ 125 వలే బైక్ మాదిరిగా వస్తుందా లేక స్కూటర్‌గా ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. CNG స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024 నాటికి పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వత దీనిని 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్.. తక్కువ ధరకు లభించే వేరియంట్ ఇదే.. ఫీచర్లు ఎందులో ఎక్కువంటే?

Advertisement

టీవీఎస్ కంపెనీ సీఎన్‌జీ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్, పెట్రోల్‌తో నడిచే వాహనాలను కొత్త కొత్త ఫీచర్లతో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CNG ద్విచక్ర వాహనాలు తక్కువ రన్నింగ్ ఖర్చులను కలిగి ఉంటాయి. అంతేకాకుండా పెట్రోల్ ఆధారిత ద్విచక్ర వాహనాల కంటే ఎక్కువ మైలేజీని ఇవి అందిస్తాయి. అలాగే ఇవి ఒక్క సీఎన్‌జీ వెర్షన్‌లోనే కాకుండా పెట్రోల్ వెర్షన్‌కు కూడా మద్దతిస్తాయి. అందువల్లనే సీఎన్‌జీ వాహనాల వైపు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇటీవలే మార్కెట్‌లో రిలీజ్ అయిన బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ కిలో సిఎన్‌జీకి 102కిమీ మైలేజీ అందిస్తుంది. అలా ఈ బైక్ మొత్తం 2kg CNG సిలిండర్‌ను పొందుతుంది. అంతేకాకుండా ఇది పెట్రోల్ మోడ్‌లో 2 లీటర్లతో వస్తుంది. ఇది లీటరుకు 65 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలా ఇది సీఎన్‌జీ అండ్ పెట్రోల్‌తో కలుపుకుని మొత్తం 300కి పైగా మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ బైక్ చాలా చౌక ధరలో రిలీజ్ అయింది. కేవలం రూ.95 వేల స్టార్టింగ్ ధర వద్ద లాంచ్ అయింది. ఇది 125cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో 9.5PS, 9.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×