అమెరికాలోని మసాచుసెట్స్ లో ఉన్న ‘వోర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్’ శాస్త్రవేత్తలు ఒక వండర్‌ను క్రియేట్ చేశారు. వెదురు బొంగులను ‘హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్’ అనే స్పెషల్ టెక్నాలజీతో ఆయిల్ లాంటి పదార్థంగా మార్చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే.. నీరు, విపరీతమైన వేడి, హై ప్రెజర్ సహాయంతో ఈ మ్యాజిక్ చేశారు. ల్యాబ్‌లో వెదురును 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర కేవలం 10 నిమిషాల పాటు వేడి చేశారు. ఈ ప్రాసెస్ స్పీడప్ అవ్వడానికి ఎలాంటి కెమికల్ క్యాటలిస్ట్‌లు కూడా వాడకపోవడం విశేషం. ఈ రీసెర్చ్‌లో వెదురు టోటల్ వెయిట్‌లో ఏకంగా 35.6 శాతం భాగం ముడి చమురులా మారిపోయింది. అయితే దీనిని డైరెక్ట్‌గా కార్లలో పోయలేము, ప్యూరిఫై చేసిన తర్వాతే ఫ్యూయల్‌గా వాడుకోవచ్చు.
ప్రస్తుతం మొక్కజొన్న నుంచి కూడా బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు కానీ, దాని కోసం కోట్లాది ఎకరాల వ్యవసాయ భూములు కావాలి. మొక్కజొన్న లాంటి పంటలను ప్రతి ఏటా మళ్లీ మళ్లీ నాటాల్సి వస్తుంది. కానీ వెదురు అలా కాదు. ఒక్కసారి నాటితే చాలు, ఏళ్ల తరబడి వేగంగా పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఎరువులు, నీటి అవసరం చాలా తక్కువ. మొక్కజొన్నను ఇంధనం కోసం వాడితే ఆహార ధాన్యాల కొరత వస్తుంది. కానీ వెదురును ఎకనామిక్‌గా పనికిరాని, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో కూడా విరివిగా పెంచవచ్చు. రెగ్యులర్ డీజిల్‌తో పోలిస్తే ఈ వెదురు ఇంధనం వల్ల కాలుష్యం ఏకంగా 26 రెట్లు తగ్గే ఛాన్స్ ఉందంట.
ఇక కాస్ట్ విషయానికి వస్తే.. కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక, ఒక గ్యాసోలిన్-గాలన్ ఫ్యూయల్ ప్రైస్ దాదాపు 2.75 డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 260 రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే లీటర్‌కు సుమారు రూ.60 నుంచి రూ.70 మధ్య ఉండవచ్చు. అయితే, ఇది కేవలం ల్యాబ్ లేదా ఫ్యాక్టరీలో ఇంధనాన్ని తయారు చేయడానికి అయ్యే ప్రాసింగ్ ఖర్చు. పంపిణీదారులు, ప్రభుత్వ పన్నులు దీనికి తోడైతే.. మార్కెట్లో లీటర్ వెదురు పెట్రోల్ ధర రూ.85 నుంచి రూ.95 వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.115 పైనే ఉంది కదా? దీని వల్ల వినియోగదారులకు లాభం ఏమిటనేగా మీ సందేహం?
Also Read: కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..
పెట్రోల్ ధరలతో పోల్చితే దాదాపు రూ.20 వరకు ధరలో వ్యత్యాసం ఉంది. యుద్ధాల వల్ల ఇంధన సరఫరా నిలిచిపోతే.. ప్రత్యామ్నయంగా దీన్ని వాడొచ్చు. పైగా ఇది గ్రీన్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తున్నప్పటికీ.. హెవీ ట్రక్కులు, కార్గో షిప్‌లు, విమాన రవాణాలో బ్యాటరీలు వాడటం చాలా కష్టం. ఇలాంటి హెవీ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్లలో క్లైమేట్ చేంజ్ ముప్పును తగ్గించడానికి ఈ వెదురు బయో ఇంధనం ఒక గేమ్ ఛేంజర్ కానుంది. భారత్, నైజీరియా లాంటి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వెదురు సమృద్ధిగా పెరుగుతుంది కాబట్టి, భవిష్యత్తులో గల్ఫ్ దేశాలపై ఇంధనపరంగా ఆధారపడటం తగ్గించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది.