BigTV English

Door mats for Home : ఇంటి ముందు ఎలాంటి డోర్ మ్యాట్ పెట్టుకోవచ్చు

Door mats for Home  :  ఇంటి ముందు ఎలాంటి డోర్ మ్యాట్ పెట్టుకోవచ్చు

Door mats for Home : ఇంటి బయటికెళ్లిన వాళ్లు గుమ్మం లోపల అడుగుపెటేటప్పుడు వేసే అడుగు డోర్ మ్యాట్ పైనే. అలాగే ఇంటికి వచ్చే చుట్టాలు, బంధువులు, మిత్రులు లోపలకి అడుగుపెట్టేటప్పుడు గమనించే అంశాల్లో డోర్ మ్యాట్ ఒకటి . మనం ఎలాంటి డోర్ మ్యాట్ పెట్టుకున్నామో కూడా గమనించే వాళ్లు లేకపోలేదు. వాటిని బట్టి కూడా మనమీద ఒక అంచనాకి వస్తారు. మనతో ప్రవర్తించే తీరును కూడా ఈ చిన్న విషయం చెబుతుంది. ఇంటికే కాదు ఇంట్లో వాడే వస్తువులకు వాస్తు వర్తిస్తుంది. ఏ కలర్ పెడితే ఆకలర్ డోర్ మ్యాట్ పెట్టకూడదు. ముఖ్యంగా ఎంట్రన్స్ గుమ్మం దగ్గర మరింత కేర్ తీసుకోవాలి. సింహద్వారం ఆనందాన్ని అదృష్టాన్ని స్వాగతిస్తుంది. గృహం లోపల ప్రవేశించే మార్గం దోషరహితంగా ఉండేలా చూస్తుంది.


ఇంటికి వాడే కలర్స్ తోపాటు ఇంట్లో ఉంచే డోర్ మ్యాట్స్ కూడా కూడా చూసుకోవాలి. డోర్స్ మ్యాట్ ఇంట్లో ప్రవేశించే దిశ బట్టి రంగులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం ఉన్న వాళ్లు ఇంటి ముందు పసుపు రంగు లేదా తెలుపు లేదా క్రీమ్ కలర్ వి ఏర్పాటు చేసుకోవాలి. పడమర దిక్కు గుమ్మం ఉంటే గ్రీన్, వైట్, బ్లూ కలర్ డోర్ మ్యాట్స్ వాడటం శ్రేయోదాయకం. నార్త్ ఫేసింగ్ ఉన్న వాళ్లు లైట్ కలర్స్ డోర్ మ్యాట్ ఉపయోగిస్తే మంచిది. తెలుపైనా, పసుపైనా ఏదైనా సరే లేత రంగులో ఉండేవిగా చూసుకోవాలి. దక్షిణం ముఖద్వారం ఉన్న వాళ్లు ఎరుపు రంగుకి ప్రాధాన్యం ఇస్తే మంచిది. గులాబీ, వెండి, ఆకుపచ్చ రంగుల్లో డోర్ మ్యాట్స్ వాడటం ఉత్తమం.

గుమ్మం ముందు పెట్టుకునే డోర్ మ్యాట్స్ డిజైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పెడితే అది పెట్టకూడదు. రెక్టాలింగ్ షేప్ లో ఉన్న వాటిని సెలక్ట్ చేసుకోవాలి. ఈ సైజ్ లో ఉన్న డోర్ మాట్స్ స్థిరమైన బంధాలను ఏర్పరించేందుకు ఉపయోగపడతాయి. రౌండ్ షేప్ లో ఉంటే ఫ్యామిలీ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. కోడిగుడ్డు ఆకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నవి పెట్టుకుంటే ఇంటి సంపదను పెంచడానికి ఉపయోగపడతాయి. డోర్ మ్యాట్ తీసుకునేటప్పుడు వాటి మెటిరియల్ కూడా గమనించాలి. కొబ్బరి పీచుతో అంటే కాయిర్ తో తయారైనవి ఎంచుకోవడం బెస్ట్ ఛాయిస్ అవుతుంది.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×