BigTV English

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Siva Jyothi: తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన వారిలో యాంకర్ శివ జ్యోతి(Siva Jyothi) ఒకరు. తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ అందరికీ సావిత్రిగా ఎంతో సుపరిచితమైన ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శివజ్యోతి అనంతరం పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ వీడియోలు , ఇంస్టాగ్రామ్ రీల్స్ తో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే శివ జ్యోతి దంపతులు గత కొంతకాలంగా పిల్లల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.


ప్రెగ్నెన్సీని ప్రకటించిన శివ జ్యోతి..

తాము పిల్లలు కావాలని కోరుకుంటున్నాం అని, త్వరలోనే మా కోరిక నెరవేరాలి అంటూ ఈమె పలు సందర్భాలలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి శివ జ్యోతి ప్రెగ్నెంట్(Pregnant) అంటూ వార్తలు వస్తున్నా, ఈ వార్తలపై ఇప్పటివరకు ఈమె ఎక్కడ స్పందించలేదు అయితే నేడు విజయదశమి సందర్భంగా ఈమె తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పిల్లల బొమ్మలతో ఉన్న ఒక వీడియోని రివీల్ చేస్తూ తాను తల్లి కాబోతున్నానని విషయాన్ని వెల్లడించారు.

మీ ఆశీర్వాదాలు కావాలి…

అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయతో మాకు 2026లో బిడ్డ రాబోతోంది. మా పిల్లల కోసం ఎంతోమంది చాలా కాలం నుంచి ఎదురుచూశారు. మీరు నాకు కావలసిన వాళ్లు, మీ సొంత అక్కకి బావకి పిల్లలు పుట్టాలని కోరుకున్న విధంగా కోరుకున్నారు. ఇలా మాకు బిడ్డ పుట్టబోతోందనే విషయాన్ని చెప్పగానే వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా లైఫ్ లో మర్చిపోను . అభిమానులుగా మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అందుకే ఈ శుభవార్తను పండుగ పూట తెలియచేస్తున్నానని వెల్లడించారు. అయితే ఎవరు దయచేసి దిష్టి పెట్టొద్దని, మీ ఆశీర్వాదాలు మాత్రమే ఇవ్వాలని కోరుకున్నారు.


?igsh=MWI0Y3RoYjhxenFpcQ%3D%3D

ఈ అద్భుతమైన ప్రయాణంలో సపోర్ట్ చేసిన వాళ్లు, నాకు సపోర్టుగా ఉన్న వాళ్ళని జీవితాంతం మర్చిపోనని తెలిపారు. అలాగే తనని బాధ పెట్టినవాళ్లను కూడా మర్చిపోనని, ఎప్పటికీ మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు నాకు నా ఫ్యామిలీకి ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకు కూడా ఉండాలి అంటూ ఈమె ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీ (Pregnancy)ని రివీల్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయట పెట్టడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శివ జ్యోతి గంగూలీ(Ganguly) అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగింది. ఇలా పెళ్లి అయిన 10 సంవత్సరాలకు వీరిద్దరూ తల్లితండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Aswini Dutt: ఘనంగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×