తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో దసరా పండుగ సంప్రదాయ పద్దతులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఊరి డొడ్రాయి వద్ద యాటను బలి ఇవ్వడం.. పోతరాజుల నృత్యాలు.. అనంతరం పాలపిట్ట దర్శనం.. తర్వాత జమ్మి చెట్టు వద్దకు వెళ్లి జమ్మి ఆకును ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుతుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దసరా జోష్ మొదలైంది. అయితే దసరా రోజు ఆనవాయితీగా వస్తున్న పాలపిట్ట దర్శనం మాత్రం అంత సులువుగా జరగడం లేదు. పాలపిట్ట దర్శనం కోసం ప్రజల ఎదురుచూపులు మొదలయ్యాయి. కొన్ని చోట్ల దర్శనమిస్తుండగా.. మరికొన్ని చోట్ల పాలపిట్ట కనిపించక నిరాశతో వెనుదిరుగుతున్నారు ప్రజలు.
దసరా రోజు పాలపిట్టను చూస్తే.. సంవత్సరమంతా విజయమే.. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా తెలంగాణలో దసరా పర్వదినాన పాలపిట్టను చూసి.. జమ్మిచెట్టు వద్దకు వెళ్లి జమ్మి ఆకును తెచ్చుకోవడం ఆచారం. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ప్రజలు పాలపిట్టను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు. పాండవులు అజ్ఞాతవాసం చేసి తిరిగి వస్తుంటే వారికి పాలపిట్ట ఎదురవటంతో విజయం సాధించారని.. అందుకే విజయదశమి రోజు ప్రతి ఒక్కరూ పాలపిట్టను వీక్షించడం ఆచారంగా మారిందని తెలిపారు నస్పూర్ ప్రజలు తెలుపుతున్నారు. మరి అంతటి విశిష్టత ఉన్న పాలపిట్ట.. ఇప్పుడు కనుమరుగు కావడానికి కారణాలేమిటీ? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు అనేది ఈ వీడియోలో చూడండి.