Bigg Boss 9 Promo: తాజాగా బిగ్ బాస్ 25వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఇమ్మానుయేల్ తన నడుము గిల్లారు అంటూ చేసిన హంగామా మామూలుగా లేదు అని చెప్పవచ్చు.
విషయంలోకి వెళ్తే తాజాగా 25వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోలో.. ఇమ్మానుయేల్ మాట్లాడుతూ..” సంచాలక్ గేమ్ లో ఎవరో నా నడుము గిల్లారు? అది మీరు కనిపెట్టి చెప్పాలి?” అంటూ సంచాలక్ గా వ్యవహరించిన భరణి శంకర్ (Bharani Shankar) తో చెప్పి హౌస్ లో నవ్వులు పూయించారు ఇమ్మానుయేల్ (Emmanuel). నా నడుము అంత బాగున్నంత మాత్రాన గేమ్ అడ్డుపెట్టుకొని గిల్లడం నాకు నచ్చలేదు. పర్సనల్ అబ్యుజ్ లాగే నేను ఫీల్ అవుతాను.. అంటూ ఇమ్మానుయేల్ మళ్లీ కామెడీ ప్లే చేయగా.. భరణి శంకర్ మాట్లాడుతూ పోనీ మీకు ఎవరి పైన అనుమానం ఉంటే చెప్పండి అని అడిగాడు.
దీంతో ఇమ్మానుయేల్ కూడా ఆ ఎవరు గిల్లారో నాకు తెలుసు.. కన్నేసి కావాలనే చేసింది ఇదంతా.. అంటుండగానే మధ్యలో తనూజ కల్పించుకొని.. ప్రూఫ్ ఉందా నేను నీ నడుము గిల్లానని అడిగింది. దానికి ఇమ్మానుయేల్ నాగ్ సార్ వచ్చినప్పుడు సార్ ఎవరు నా నడుము గిల్లారో వారి ఫోటో ఒక్కటే చూపించండి అని అడుగుతాను అంటూ అటు సీరియస్ గా మాట్లాడుతూనే.. ఇటు హౌస్ లో కామెడీ పంచే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ ప్రోమోలో ఈ పాయింట్ హైలెట్ గా నిలిచింది. ఇది చూసిన ఆడియన్స్ ఇదెక్కడి గోల రా బాబు అంటూ కామెంట్లు చేశారు.
ప్లేట్ మార్చిన భరణి శంకర్.మీ
ఇక కట్ చేస్తే బిగ్ బాస్ మాట్లాడుతూ.. భరణి హంగ్రీ హిప్పో గ్రౌండ్లో ఎవరు గెలిచారు ? అంటూ అడగగా.. సడన్గా భరణి శంకర్ ప్లేట్ మారుస్తూ బ్లూ టీం పేరు చెబుతాడు. టాస్క్ పెట్టినప్పుడు రెడ్ టీంకి ఇచ్చిన భరణి తర్వాత.. బెనిఫిట్ అవుట్ ఆఫ్ కింద ఈ పాయింట్ బ్లూ టీం కి ఇస్తున్నానని చెప్పారు. ఈ పాయింట్ విషయంలో అటు టీమ్స్ మధ్య గొడవ భారీగానే జరిగిందని చెప్పవచ్చు . ఎవరికివారు తాము కష్టపడ్డామంటే తాము కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. సుమన్ అయితే ఏకంగా నేను హిప్పో నోట్లోకి వెళ్లిపోయేవాడిని అంటూ కామెంట్ చేశాడు. మరి సంచాలక్ నిర్ణయాన్ని బిగ్ బాస్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.
also read:Raju Gari gadhi 4: భయపడ్డానికి సిద్ధం కండి.. ఒళ్ళు గగుర్పొడిచే పోస్టర్ రిలీజ్!
బిగ్ బాస్ 9 ఈ వారం నామినేషన్ లిస్ట్..
ఇకపోతే ఈ వారం నామినేషన్స్లోకి 6 మంది వచ్చేశారు. శ్రీజ, దివ్య నిఖిత, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా నామినేషన్స్ లోకి వచ్చేసారు ఇప్పుడు వీరందరిలో శ్రీజ, దివ్య నిఖిత మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం.