Varun Tej -Lavanya Tripathi: మెగా ఇంట్లో బుల్లి వారసుడు అడిగి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతులకు సెప్టెంబర్ 10వ తేదీ మగ బిడ్డ జన్మించారు. ఇలా మెగా ఇంట్లో వారసుడు జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బాబు సెప్టెంబర్ 10వ తేదీ జన్మించడంతో సెప్టెంబర్ 3వ తేదీ ఎంతో ఘనంగా నామకరణ వేడుకను కూడా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగా కుటుంబం ఎక్కడ షేర్ చేయలేదు కానీ తాజాగా లావణ్య వరుణ్ తేజ్ తమ కొడుకు పేరును రివిల్ చేశారు.
మెగా కుటుంబం ఆంజనేయస్వామిని పెద్ద ఎత్తున పూజిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆంజనేయస్వామి పేరు కలయికగా తమ కుమారుడికి “వాయువ్ తేజ్ కొణిదెల”(Vaayuv tej konidela) అని పెట్టినట్లు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెల్లడించారు. ఇలా తమ కుమారుడి పేరును రివిల్ చేస్తూ వీరిద్దరూ తమ కొడుకుతో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ ఫోటోలలో ఎక్కడ తమకుమారుడి ఫేస్ కనపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇలా ఆంజనేయస్వామి ఆశీస్సులతో వరుణ్ దంపతులు తమ కుమారుడికి ఈ పేరు పెట్టారని స్పష్టమవుతుంది.
ఇక మెగా కుటుంబంలోని హీరోలు అందరి పేర్లు చివర తేజ్ అని పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా వరుణ్ తేజ్ తన కుమారుడికి కూడా పేరు చివరన తేజ్ అని వచ్చేలాగా “వాయువ్ తేజ్ ” అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు పేరు చాలా బాగుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పాలి.
ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకుండా, రహస్యంగా ప్రేమలో కొనసాగుతూ వచ్చారు. ఇక వీరి లవ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. చివరికి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. అలాగే 2023 నవంబర్లో ఇటలీలో ఎంతో అందంగా వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సతీ లీలావతి అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమాకి విడుదల కానుంది. ఇక వరుణ్ తేజ్ సైతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇక ఈయన చివరిగా మట్కా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
Also Read: Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!