Amazon Great Indian Festival 2025: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పండగ సీజన్‌కి ముందుగానే అమెజాన్ అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దసరా, దీపావళి వంటి పండగల వాతావరణంలో షాపింగ్ చేస్తూ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఈ ఫెస్టివల్ ద్వారా లభిస్తోంది. ఈ సేల్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, 25 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని అమెజాన్ ప్రకటించింది.
షాపింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయం
ఈసారి షాపింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సామ్‌సంగ్ గెలాక్సీ AI , ఇంటెల్ కోర్ అల్ట్రా పవర్ పార్ట్‌నర్లుగా ఉన్నారు. టెక్నాలజీ ప్రమోషన్‌తో పాటు వినియోగదారులకు ఫ్రీ డెలివరీ సదుపాయం, యూపీఐ పేమెంట్ సౌకర్యం, రివార్డ్స్ పాయింట్లు వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. అంటే వస్తువులు కొనుగోలు చేయడమే కాకుండా అదనంగా బహుమతులు గెలుచుకునే అవకాశమూ ఉంది.
బంపర్ ఆఫర్లు
ఇప్పుడు వస్తే ఆఫర్ల గురించి. మొబైల్ ఫోన్ల మీద 40 శాతం వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో బంపర్ ఆఫర్లు పెట్టడంతో కస్టమర్లు భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్‌టాప్స్ మీద 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు వంటి గృహోపకరణాల మీద 60 శాతం వరకు తగ్గింపులు ఇచ్చారు. పండగ సమయంలో కొత్త వస్తువులు ఇంటికి తీసుకురావాలనుకునే వారికి ఈ ఆఫర్లు పెద్ద లాభం అవుతున్నాయి.
Also Read: Bengaluru metro: మెట్రోలో తిట్టుకున్న మహిళామణులు.. హిందీలో మాట్లాడినందుకు రచ్చ రచ్చ
ప్రత్యేక డిస్కౌంట్లు
అమెజాన్ ఇంతటితో ఆగిలేదు, రోజువారీ అవసరమైన గ్రాసరీస్, హౌస్‌హోల్డ్ ప్రోడక్ట్స్ మీద కూడా ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి. దీంతో పండగ కోసం పెద్ద వస్తువులు మాత్రమే కాకుండా, రోజూ వాడే వాటినీ తక్కువ ధరలో కొనుగోలు చేయగలుగుతున్నారు. కస్టమర్ల ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు “లైట్‌నింగ్ డీల్స్”, “గోల్డెన్ అవర్ డీల్స్” లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. అంటే ఒక గంట పాటు మాత్రమే ఉండే ప్రత్యేక తగ్గింపులు. ఈ ఆఫర్లను మిస్ అయితే మళ్లీ లభించవు. అందుకే చాలా మంది టైమ్ కట్టుకుని ఈ డీల్స్‌ను పట్టేస్తున్నారు. ఈ ఆఫర్లపై అమెజాన్ ప్రతి రోజూ టైం కేటాయిస్తుంది. దీనిపై అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తే మీకు టైంతో సహా ఆఫర్లు కూడా కనిపిస్తాయి. దీని ఆధారంగా మీరు ఏం కావాలో ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు.
ఇదే సరైన సమయం
ఈ ఫెస్టివల్ వాతావరణం కేవలం ఆన్‌లైన్ షాపింగ్ వరకే పరిమితం కాకుండా, నిజంగానే ఒక పండగలా అనిపించేలా అమెజాన్ సెట్ చేసింది. అద్భుతమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు ఇవన్నీ కలిపి ప్రతి కుటుంబానికీ పండగ మరింత ప్రత్యేకంగా మారుతోంది. దసరా, దీపావళి సీజన్‌లో వస్తువులు కొనాలని అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లు సంవత్సరం పొడవునా ఒక్కసారి మాత్రమే వస్తాయి.