BigTV English

Astrology: రాశి ఫలాలు.. వీళ్లు ఏ పని చేపట్టినా విజయమే!

Astrology: రాశి ఫలాలు.. వీళ్లు ఏ పని చేపట్టినా విజయమే!
Astrology: కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి శుభ సమయాలు ప్రారంభమవుతాయి. అలాగే ఏ పని చేపట్టిన విజయం వరిస్తుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం: 
మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనుకోకుండా మంచి సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమస్యల నుంచి బయపడుతారు. సమయాన్ని మంచి పనుకోసం వినియోగించాలి. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఇతరులు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దుర్గమ్మ వారిని పూజించాలి.
వృషభం:
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల సలహాలు తీసుకుంటే విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. బంధుమిత్రులతో ప్రయోజనం పొందుతారు. గోసేవ చేస్తే అనుకున్న పనుల్లో విజయం వరిస్తుంది.
మిథునం:
మిథునం రాశి వారికి మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అందరినీ కలుపుకొని పనిచేస్తే లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేస్తారు. ఇష్టదూవ ధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం:
కర్కాటకం రాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి. శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. వ్యాపారం లాభదాయంగా సాగిపోతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని సంఘటనలు బాధకు గురిచేస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.
సింహం:
ఈ రాశి వారికి కాలం సహకరిస్తుంది. కొన్ని అత్యవసర వ్యవహరాలు పూర్తవుతాయి. సన్నిహితు నుంచి గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మిత్రుల నుంచి సహకారం ఉంటుంది, నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
కన్యరాశి:
కన్యరాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి.
తులరాశి:
ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంది. ఆదాయం పెరుగుతుంది. బంధువులు, కుటుంబ సభ్యుల  నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. లాభచంద్ర సంచారం అనుకూలమైన లాభాలు ఇస్తుంది. ప్రతిభకు అభినందనలు వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. ఇష్టదైవాన్ని పూజించాలి.
వృశ్చికం:
ఈ రాశి వారికి  లాభాలు పర్వాలేదు. మనోబలం తగ్గకుండా చేసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడుతారు. ప్రవర్తనా విషయంలో ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అకారణ కలహ సూచన ఉంది. అధికారులు అప్రమత్తతతో ఉండాలి. విష్ణు నామస్మరణ చేయాలి.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారు కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహం సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మకరం:
అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు అవసరం. అనుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తారు. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. జీవితం బిజీ అయిపోతుంది. దుర్గారాధన ఉండాలి.
కుంభం:
ఈ రాశి వారు మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మెప్పిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం ఉత్తమం. అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఆవేశాలకు పొకూడదు. శని ధ్యానం చేయాలి.
మీనం:
మీనం రాశివారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాకంగా సాగిపోతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన చేస్తే మంచిది.


Tags

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×