మొన్న కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం.. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. తప్పు ఎవరిదైనా పదుల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు ఘటనలో 19 మంది సజీవ దహనం కాగా, తాజాగా ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 కంకరలో ముగిని ప్రాణాలు విడిచారు. అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సర్వీసుల నుంచి ప్రైవేట్ స్లీపర్ బస్సుల వరకు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
సాధారణ బస్సుల క్రాష్ విశ్లేషణల ప్రకారం కొన్ని సీట్లు సురక్షితమైనవిగా చెప్తారు రవాణా నిపుణులు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం సేఫ్టీని ప్రభావితం చేసే కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ క్రాష్ రకం: ముందు సీట్లు హెడ్ ఆన్‌లలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 15% మంది ప్రయాణీకులు ఈ సీట్లలో కూర్చున్న వారే చనిపోతున్నారు. వెనుక సీట్లలో ఉన్న ప్రయాణీకులు కూడా కొన్నిసార్లు వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. మిడిల్ ప్లేస్ లోని సీట్ల మీద తక్కువ ప్రమాద ప్రభావం పడుతుంది.
⦿ సైడ్ ప్రొటెక్షన్: భారత్ లో ఎడమవైపు ట్రాఫిక్, కుడి వైపు విండో సీట్లు ఎదురుగా వచ్చే ట్రాఫిక్ ను ఎదుర్కొంటాయి. సైడ్ స్వైప్ ప్రమాదాలు పెరుగుతాయి. ఎడమ వైపు సీట్లు, ప్రమాదాలకు తక్కువగా గురవుతాయి.
⦿ మధ్య వరుసలు (5–10 వరుసలు):
ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణీకులు మధ్యన ఉన్న 5-10 వరుసల్లోని వారే ఎక్కువ. ఈ ప్రాంతం ముందు, వెనుక జోన్ల నుంచి దూరంగా ఉంటుంది. ఎదురుగా, లేదా వెనుక నుంచి వాహనాలు ఢీకొట్టినా ప్రమాద తీవ్రత ఈ ప్రదేశం మీద తక్కువగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ అధ్యయనాల ప్రకారం ఈ సీట్లలో కూర్చున్న ప్రయాణీకులకు 20 నుంచి 30% తక్కువ గాయాలు అయినట్లు వెల్లడించాయి. ఒకవేళ స్లీపర్ బస్సులో దిగువన ఎడమ వైపు బెర్త్ లను ఎంచుకోవడం మంచిది.
⦿ డ్రైవర్ వెనుక (2–4 వరుసలు): ఇవి కూడా సేఫ్ సీట్లుగానే చెప్పుకోవచ్చు. త్వరిత సహాయం, పాక్షికంగా ముందు రక్షణ కలుగుతుంది. డ్రైవర్ టెక్నిక్స్ కారణంగా తరచుగా ఈ సీట్లు సేఫ్ గా ఉంటాయి. కానీ, కొన్నిసార్లు ప్రమాద తీవ్రత పెరిగితే ప్రయాణీకులు చనిపోయే అవకాశం ఉంటుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ ఎనుకవైపు కూర్చున్న ప్రయాణీకులే ఎక్కువగా చనిపోయారు.
⦿ మధ్య వరుసలు(ఎడమ వైపు విండో): ఈ ప్లేస్ లో కూడా ప్రమాద తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. ఎడమ వైపు సైడ్-ఇంపాక్ట్ ఎక్స్ పోజర్‌ను తగ్గిస్తుంది.
⦿ ముందు వరుసలు (1–3): హెడ్ ఆన్‌లలో కూర్చున్న ప్రయాణీకులు ఎక్కువగా చనిపోతారు.
⦿ వెనుక వరుసలు: వెనుక క్రాష్ ల కారణంగా వెనుక ఉన్న ఫ్యూయెల్ ట్యాంకుల్లో మంటలు చెలరేగి చనిపోయే అవకాశం ఉంటుంది.
⦿ కుడి వైపు సీట్లు: బస్సు పక్కవైపు ఢీకొన్నప్పుడు కుడివైపు సీట్లలోని వాళ్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!