భారతీయ రైల్వేలోకి సెమీ హైస్పీడ్ రైలుగా ఎంట్రీ ఇచ్చిన వందేభారత్.. ప్రయాణీకులకు అత్యంత వేగవంతమైన, సౌకర్యాలతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ఈ రైళ్లు పరిశుభ్రతకు మారుపేరుగా చెప్తోంది రైల్వే. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక ప్రయాణీకుడు తాను ప్రయాణిస్తున్న రైలు అపరిశుభ్రంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు.
ఆశిష్ ప్రకాష్ అనే ప్రయాణీకుడు ఇటీవల వందేభారత్ లో ప్రయాణం చేశాడు. ప్రయాణ సమయంలో ఆయన తీసిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. వందే భారత్ రైలులోని రెండు చిత్రాలను పోస్ట్ చేశాడు. ఇందులో కోచ్ మురికగా కనిపించడంతో పాటు సీట్ల మధ్య ప్రదేశం కూడా అపరిశుభ్రంగా కనిపించింది. ఈ ఫోటోలను ఆశిష్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేశాడు. రైళ్లు ఇలాగే ఉంటే, భవిష్యత్తులో వాటి పరిస్థితి మరింత దిగజారిపోతుందని విమర్శించాడు. “మీరు రైళ్లను ఇలాగే వదిలేస్తే, వందే భారత్ చెత్తగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు” అని రాసుకొచ్చాడు.
వందే భారత్ రైలు శుభ్రతపై విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలోనే, మరొక ప్రయాణీకుడు కోచ్ లో ఉన్న మురికి పరిస్థితుల గురించి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. హ్యాండ్ డ్రైయర్లు లేకపోవడం, వాష్ రూమ్ లో మురికి పేరుకోవడం, సీట్లు, టేబుల్స్ మురికిగా ఉండటం, సీట్ బ్యాక్ లు లేవని ఆయన కంప్లైంట్ చేశాడు. ఆయన ఫిర్యాదును స్వీరించిన రైల్వే అధికారులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.
@AshwiniVaishnaw @RailMinIndia @ECRlyHJP if this is the way you keep cleaning trains days are not far when vande Bharat is going to turn into shit. Most people India don’t follow civic sense. pic.twitter.com/IhaV34bOEC
— ashish prakash (@ashishprakas) November 2, 2025
Read Also: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!
మురికి వందేభారత్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రయాణికుల సహాయం లేకుండా రైల్వే మ్యాజిక్ చేయలేవు. మనం ఎక్కడ ఉన్నా, మన పరిసరాలలో పరిశుభ్రత పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. చక్కగా గోడల మీద పెయింటింగ్ చేస్తే.. కొంత మంది అదే గోడల మీద పాన్ నమిలి ఉమ్ముతున్నారు. మన బాధ్యత లేకపోతే ఏదీ నీట్ గా ఉండదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “నిజాయితీగా చెప్పాలంటే, మేము ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాము. అధికారులు రైళ్లను ఎంత శుభ్రం చేసినా, ప్రయాణీకులు కోచ్ లలో చెత్త వేయడం కొనసాగిస్తే, పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడదు’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
Read Also: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?