వాస్తు శాస్త్రం మన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంలో వాస్తు శాస్త్రంలోని నియమాలు ఉపయోగపడతాయి. చిన్న చిన్న పనులు కూడా వాస్తు నియమాలకు భంగం కలిగించి సమస్యలను తెచ్చి పెడతాయి. ఈ ఇంటి వాస్తుకు సంబంధించి తెలుసుకొనే విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది రాత్రి నిద్రపోయేటప్పుడు పక్కన నీటి బాటిల్ పెట్టుకుంటారు. అర్ధరాత్రి అవసరమైతే నీరు తాగడానికి ఇలా దగ్గరగా ఉంచుతారు. అయితే ఇది సరైన పనా కాదా అన్నది వాస్తు శాస్త్రం చెబుతోంది.
చంద్ర దోషం వస్తుంది
వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునే మంచం పక్కన లేదా మంచానికి దగ్గర్లో వాటర్ బాటిల్ పెట్టుకోవడం అనేది మంచిది కాదు. వాటర్ బాటిలే కాదు గ్లాస్ తో నీళ్లు కూడా పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తలకి కింద భాగంలో లేదా తల చుట్టూ ఎక్కడైనా కూడా నీరు పెట్టడం వల్ల చంద్ర దోషం వస్తుంది. ఇది మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. దీనివల్ల జీవితంలో ప్రతికూలత పెరిగిపోతుంది. చంద్ర దోషం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. కాబట్టి మంచానికి దగ్గరగా ఎప్పుడూ నీటిని ఉంచుకోకూడదు.
చంద్ర దోషం ఇలా తొలగించండి 
ఒకరి జాతకంలో చంద్ర దోషం ఉంటే దాన్ని తొలగించే పరిహారం కూడా సులువుగానే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం చంద్ర దోష ప్రభావాలను తగ్గించడానికి సోమవారం ఉత్తమమైనది. ఆరోజు శివుడిని పూజించాలి. ఆవుపాలతో చేసిన ఆహారాలను నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలను నేరుగా నైవేద్యంగా పెట్టినా మంచిదే. ఏదైనా తెల్లటి వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదం. చక్కెర, బియ్యం, తెల్లగా ఉండే మిఠాయిలు, తెల్లని బట్టలు దానం చేస్తే చంద్ర దోషం క్రమంగా తొలగిపోయే అవకాశం ఉంది. మీ జాతకంలో చంద్ర దోషం ఉందో లేదో జ్యోతిష్యులను అడిగి తెలుసుకోవచ్చు.
మీ జాతకంలో చంద్ర దోషం లేకపోయినా ఇలా మంచం దగ్గర లేదా మంచం పక్కన రాత్రిపూట నీటిని పెట్టుకోవడం వల్ల చంద్ర దోషం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీకు దూరంగా నీళ్లను పెట్టుకుంటే ఉత్తమం. దీనివల్ల ఎలాంటి చంద్ర దోషం కరగదు.
చంద్రుడు ఒకరి జీవితంలో భావోద్వేగాలను, మనస్సును, అంతర్గతంగా ఉండే శాంతిని నియంత్రించే గ్రహం. ఎప్పుడైతే చంద్రుడు బలహీనమవుతాడో అప్పుడు భావోద్వేగ సమతుల్యత తగ్గిపోతుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే వారి మానసిక ఆరోగ్యం మారిపోతుంది. వారు మానసిక సమస్యల బారిన త్వరగా పడతారు. డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి.