ఇందుకు సంబంధించిన చెక్కును అందించేందుకు.. యాలాల మండలం పేర్కంపల్లిలోని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎల్లయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయన చెక్ తీసుకుంటూ ముగ్గురి కూతుళ్లను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టుకున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది.
తన రెండో కుమార్తె ఉద్యోగం చేస్తూ.. నెలకు రూ. 60, 000 సంపాదించేదని ఎల్లయ్య గౌడ్ పేర్కొన్నాడు. ఇప్పుడు తన ముగ్గురు కుమార్తెలు తనకు పంపిన జీతమా ఇది అంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
కాగా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, అలాగే ఆర్టీసీ తరుపున రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం కలిసి రూ. 21 లక్షల చెక్కును తండ్రికి అందించారు.
ఎల్లయ్య గౌడ్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెళ్లి ఘనంగా జరిపించాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చేస్తూ.. జాబ్ చేస్తోంది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నల్గవ కూతురు అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొడుకు తాండూరులోని ఓ ప్లైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న జరిగిన అక్క అనూష వివాహానికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు.
Also Read: బీచ్ కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు..
ఆమె వివాహం అయిన 17 రోజుల్లోనే ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపించాడు. ఎల్లయ్యకు ఒక కొడుకు ఉన్నట్లు సమాచారం.