E-Paper
Advertisement

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..
Advertisement

Ahmedabad Crime: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా చంపుకోవడం అనే కాన్సెప్ట్ మొదలైంది. సరిగ్గా దృశ్యం మూవీని గుర్తుకు తెచ్చేలా ఓ ఘటనలో అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. భర్తను హత్య చేసిన మహిళ, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంట్లోని వంటగదిలో పూడ్చిపెట్టింది. మూడు నెలలు  తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

దృశ్యం మూవీ తరహాలో

Advertisement

బీహార్‌కు చెందిన అన్సారీ-రూబీతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2016లో అహ్మదాబాద్‌కు మకాం మార్చాడు. మ్యారేజ్ తర్వాత బీహార్ నుంచి గుజరాత్‌కు వలస వచ్చింది అన్సారీ ఫ్యామిలీ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత అతడు తాపీ మేస్త్రీగా పని చేసేవాడు.

ఆ తర్వాత రూబీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రియుడి పేరు ఇమ్రాన్. ఈ వ్యవహారం చాలా గుట్టుగా సాగింది. ఈ విషయం రూబీ భర్త అన్సారీకి తెలియడంతో ఆమెని మందలించాడు. ఆపై గొడవ పడ్డాడు. అయినా ఆమెలో ఏలాంటి మార్పు రాలేదు. చివరకు తన ఆనందానికి అడ్డు వస్తున్నాడని భావించింది.

Advertisement

భర్తని చంపి వంట గదిలో పూడ్చింది

పక్కాగా స్కెచ్ వేసి భర్తను చంపేసింది. ప్రియుడు ఇమ్రాన్, అతడి బంధువుల సహాయం తీసుకుంది. భర్తని చంపేసి మృతదేహాన్ని వంటగదిలో పూడ్చిపెట్టింది. పైకి ఏమీ తెలియనట్టుగా వ్యవహరించేది. బీహార్‌కు చెందిన సమీర్ అన్సారీ చాలా కాలంగా కనిపించడం లేదని, అతడు అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇరుగుపొరుగు వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలుత ఫోన్ చేశారు.. కానీ స్విచ్ఛాప్ అని వచ్చింది. దీనిపై ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం సేకరించారు పోలీసులు. చివరకు ఇమ్రాన్‌తో రుబీని సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. రుబీ ప్రియుడి బంధువులను విచారించడంతో అక్కడ క్లూ దొరికింది.

ALSO READ:  చీమల ఫోబియా.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత

దాని ప్రకారం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం రూబీ, ప్రియుడు ఇమ్రాన్ బంధువులు పరారీలో ఉన్నాడు. తన భర్త దుబాయ్ వెళ్లాడని ఇరుగుపొరుగు వారికి చెప్పి నమ్మేచేంది రుబీ. ఆ తర్వాత అన్సారీ ఫ్యామిలీ ఉన్న ఇంటికి అద్దెకు ఇచ్చింది. ఆ ఇంట్లోకి మరొకరు అద్దెకు దిగారు. ఇంట్లో దుర్వాసన రావడంతో అద్దెకి దిగినవారు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఇమ్రాన్ ఇచ్చిన సమాచారంతో గతంలో రుబీ ఉన్న ఇంటికి వచ్చి వంట గదిలో తవ్వకాలు మొదలుపెట్టారు పోలీసులు. అన్సారీ ఎముకలు, అవశేషాలను వెలికి తీశారు. ఈ విషయాన్ని  క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. పరారీలో ఉన్న రుబీ, ప్రియుడి బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×