Anasuay Bharadwaj Wolf Item Song: అనసూయ భరద్వాజ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా యమ క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకర్గా రాణిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరిసింది. నటనతోనూ ఆడియన్స్ని ఆకట్టుకున్న అనసూయకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అతి తక్కువ టైంలో స్టార్ నటిగానూ గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ యాంకర్లలో ఒకరిగా బుల్లితెరను ఎలేస్తూనే.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. నటిగానే కాదు మూవీలో లీడ్ రోల్స్ సైతం చేసింది.ఔ
లేడీ ఒరియంటెడ్ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. దీంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ ఈ మధ్య సైలెంట్ అయ్యింది. పుష్ప 2 తర్వాత ఇప్పటి వరకు కొత్తగా సినిమాలకు సంతకం చేయనట్టే అనిపిస్తోంది. చివరిగా రజకార్, పుష్ప 2 లో కనిపించిన అనసుయా ఇటీవల అరి సినిమాలో లీడ్ రోల్లో కనిపించింది. అయితే ఇది ఎప్పటిదో మూవీ కానీ, రిలీజ్కి ఆలస్యం అయ్యింది. ఆ మధ్య అనసూయ పలు తమిళ్ సినిమాలకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. అందులో ఊల్ఫ్ ఒకటి.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవ హీరోగా అంజు కురియన్ హీరోయిన్ గా వినో వెంకటేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనసూయ కూడా నటిస్తోంది. గతంలో 2023లో ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మూవీ ఆగిపోయినట్టు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో అనసూయ కూడా నటించింది. సాసా అంటూ సాగే ఈ పాటలో అనసూయతో పాటు రాయ్ లక్ష్మి కూడా కనిపించింది.
హీరో ప్రభుదేవతో రొమాన్స్ చేస్తూ కనిపించింది. చూస్తుంటే ఇందులో అనసూయది బోల్డ్ రోల్ అని తెలుస్తోంది. ఐటెంలో సాంగ్లో ఇంత బోల్డ్ కనిపించడం ఇదే మొదటి సారి. దీంతో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ టైంలో మూవీ టీం వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంఇచ లాంగ్ గ్యాప్ తర్వాత అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అంత ఖుష్ అవుతున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ఇతర వివరాలను మూవీ టీం ప్రకటించనుంది.
Also Read: The Girlfriend Movie: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీపై బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ రివ్యూ.. ఏమన్నారంటే