Telangana: నిన్న కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పూజలు చేసి, దీపాలు వెలిగించారు.. ఎక్కడ చూసిన దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. అంతేకాకుండా నిన్న వ్రతాలు కూడి చేశారు. కార్తీక పౌర్ణమి అనేది ఎంతో విశిష్టమైన రోజు.. కానీ, అలాంటి విశిష్టమైన రోజున క్షుద్ర పూజలు చేయడం గ్రామంలోని ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. అసలు ఏం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లాల్లో కలకలం రేపిన క్షుద్రపూజలు..
సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అక్కడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ముగ్గు వేసి పసుపు, కుంకుమతో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించారు. రోజు వారిగా ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు, సిబ్బంది క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి స్థానికులకు సమాచారం అందించారు..
భయాందోళనలో గ్రామస్తులు, విద్యార్థులు..
అయితే నిన్న కార్తీక పౌర్ణమి అయినందున క్షుద్ర పూజలు నిర్వహించి ఉంటారని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ, స్కూల్ ఆవరణలో క్షుద్ర పూజలు నిర్వహించడంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. “ఇది మా గ్రామంలో మొదటిసారి జరిగిన ఘటన. పిల్లలు భయపడి స్కూల్‌కు రావట్లేదు” అని ఒక తల్లి బాధతో చెప్పింది.
Also Read: జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాస్ స్పీచ్..
మరో ప్లేస్‌లో క్షుద్ర పూజలు కలకలం..
మరో వైపు వరంగల్ జిల్లాలోని ఇల్లంద గ్రామంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇల్లంద గ్రామ శివారులోని శ్మశాన వాటికలో పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాయలతో దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఘటనా స్థలంలో పెద్ద దీపం పెట్టడంతో పాటు జంతు బలి ఇచ్చిన ఆనవాళ్లు ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఎవరు చేశారు? ఇలా.. ఎందుకు చేశారు? అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.