ప్రయాణ సమయంలో కొంత మంది ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, ఆస్తి పత్రాలు, బ్యాంకు పత్రాలు, పర్సులు పోగొట్టుకుంటారు. మరికొంత మంది బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు మిస్ అవుతాయి. ఈ డాక్యుమెంట్స్ ఎవరికైనా దొరికితే ఇవ్వాలని కొంత మంది పేపర్లలో యాడ్స్ ఇస్తుంటారు. దొరికిన వాళ్లు ఆ యాడ్ చూసి వారికి అందించే ప్రయత్నం చేస్తారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన యాడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ పేపర్ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చట్టపరమైన, అధికారిక ప్రయోజనాల కోసం మరణ ధృవీకరణ పత్రం ఇస్తారు. ఇది సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎంతో ముఖ్యమైనది. ఈ సర్టిఫికేట్ ఎవరైనా మరణించిన తర్వాత మాత్రమే ఇస్తారు. కానీ, ఇటీవల, ఒక అసాధారణమైన యాడ్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఓ వ్యక్తి తన సొంత డెత్ సర్టిఫికేట్ పోయిందని పేపర్ లో యాడ్ ఇచ్చాడు. ఈ విచిత్రమైన యాడ్ చూసి అందరూ షాక్ అయ్యారు. మరికొంత మంది ఆశ్చర్యపోయారు. “స్వర్గానికి వెళ్లడానికి మీకు డెత్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చిందా?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వైరల్ పోస్ట్ ను @DoctorAjayita అనే ఎక్స్ యూజర్ షేర్ చేశారు. ఈ పేపర్ యాడ్ ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ సెక్షన్ లో ఉంది. ఇందులో రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి సెప్టెంబర్ 7, 2022న ఉదయం 10 గంటల ప్రాంతంలో అస్సాంలోని లమ్డింగ్ బజార్‌లో తన మరణ ధృవీకరణ పత్రాన్ని పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తనకు తాను డెత్ సర్టిఫికేట్ పోయిందని ఎలా యాడ్ ఇచ్చాడంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
https://twitter.com/DoctorAjayita/status/1983825799754215860/photo/1
నిజానికి ఈ ఫన్నీ యాడ్ కు కారణం టైపింగ్ మిస్టేక్. ఆ వ్యక్తి బహుశా తన జనన ధృవీకరణ పత్రం లేదంటే అతడి తండ్రి మరణ ధృవీకరణ పత్రం పోయినట్లు చెప్పాలనుకున్నాడు. అయినప్పటికీ, చిన్న మిస్టేక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ 20,000 కంటే ఎక్కువ వ్యూస్ అందుకుంది. బోలెడ్ ఫన్నీ కామెంట్స్ చేశారు నెటిజన్లు. “అతడిని స్వర్గంలోకి ప్రవేశించనివ్వడం లేదు — ఎవరైనా నకిలీ డెత్ సర్టిఫికేట్ చేసి పంపుతారా?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ యాడ్ దయ్యాలు ఉన్నాయని నిరూపిస్తుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Alos: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?