Google Maps Offline| ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో అడ్రస్ తెలుసుకోవడానికి స్టార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఈ సౌలభ్యం రోజువారీ జీవితాల్లో భాగమైపోయింది. సుదూర ప్రయాణాలు చేసేవారికి ఇది తప్పనిసరిగా మారింది. కానీ, ప్రతిచోటా ఇంటర్నెట్ సిగ్నల్ అందుబాటులో ఉండదు. పర్వత ప్రాంతాల్లో లేదా గ్రామ పరిసరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్ లేకపోవచ్చు. అలాంటి సమయాల్లో గూగుల్ మ్యాప్స్ నిరుపయోగంగా మారుతుంది. అయితే ఈ మ్యాప్స్ ఫీచర్ ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేసే ట్రిక్ ఉంది. దీని కోసం మీ ఫోన్ లో సింపుల్ సెట్టింగ్స్ చేయాలి.
గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు అనేక స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఫోటో-ఫస్ట్ సెర్చ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సమర్పించిన స్థలాల ఫోటోలను చూడవచ్చు. లైవ్ వ్యూ అనే ఫీచర్ మీ ఫోన్ కెమెరాను ఉపయోగించి ఏ దిశలో ఉన్నాయో చూడవవచ్చు. అలాగు యారో, కమాండ్స్ బ్లూ కలర్‌లో నేరుగా మీ స్క్రీన్‌పై చూపిస్తుంది.
AI ఆబ్జెక్ట్ రికగ్నిషన్ ఫీచర్ సమీపంలోని స్థలాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది స్థలాల పేర్లను, సమాచారాన్ని చూపిస్తుంది. AI కన్వర్జేషనల్ సెర్చ్ ద్వారా మీరు సాధారణ భాషలో ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు.. రెస్టారెంట్లు లేదా ప్రయాణ ప్రణాళికల గురించి సూచనలు పొందవచ్చు. అలాగే, ఫ్లైట్ ట్రాకింగ్ టూల్ విమాన షెడ్యూల్స్‌ను చూడడానికి, ధరలను కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్లు మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
పర్వత ప్రాంతాలు, గ్రామ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేకపోవడంతో అడ్రస్ తెలుసుకోవడంతో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు ముందుజాగ్రత్తతో గూగుల్ మ్యాప్స్‌లో ఫీచర్ ఉంది. అదే మీ ప్రయాణించే ప్రదేశానికి సంబంధించిన మ్యాప్స్ ని ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
గూగుల్ మ్యాప్స్ యాప్ తెరవండి:
మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను తెరిచి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉండకూడదు.
ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి: యాప్‌లో కుడి వైపు పైన టాప్ కార్నర్ లో మీ ప్రొఫైల్ చిత్రం లేదా ఇనీషియల్స్‌పై ప్రెస్ చేయండి. అక్కడ నుండి ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ ఎంచుకోండి.
మీకు కావాల్సిన మ్యాప్ ఎంచుకోండి: ‘సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్’ ఎంపికపై ప్రెస్ చేయండి.
స్క్రీన్‌పై బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్‌ను మీరు కావలసిన ప్రాంతానికి తరలించవచ్చు లేదా దాని పరిమాణాన్ని సరిచేయవచ్చు. మీకు కావలసిన ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత, క్రింద ఉన్న ‘డౌన్‌లోడ్’ బటన్‌పై నొక్కండి. డౌన్‌లోడ్ అయిన మ్యాప్ ఆఫ్‌లైన్ మ్యాప్స్ విభాగంలో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా ఈ మ్యాప్‌ను ఉపయోగించవచ్చు.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?