BigTV English
Advertisement

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Karthika Pournami 2025: కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు అనంతకోటి పుణ్యఫలాన్ని ఇస్తాయి.


ఏడాదంతా దీపారాధన ఫలితం ఇచ్చే ఆ విశేష పూజ ఏంటి ?
కార్తీక పౌర్ణమి రోజు చేసే ఒక ప్రత్యేకమైన దీపారాధన ఆ సంవత్సరమంతా రోజూ దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఆ పూజ మరేదో కాదు… 365 వత్తులతో దీపారాధన చేయడం.

దీని వెనక ఉన్న ఉద్దేశం:
సాధారణంగా కార్తీక మాసం అంతా, లేదా వీలైనన్ని రోజులు శివాలయంలో లేదా ఇంట్లో దీపారాధన చేస్తారు. అయితే.. సంవత్సరం పొడవునా (365 రోజులు) దీపారాధన చేయలేనివారు. ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఒకే దీపంలో లేదా 365 చిన్న ప్రమిదల్లో వెలిగిస్తే.. సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలం కలుగుతుందని పండితులు చెబుతారు.


ఎప్పుడు, ఎక్కడ చేయాలి:
ఈ దీపారాధనను సాయంత్రం, సూర్యాస్తమయం తరువాత దేవాలయంలో, తులసి కోట వద్ద లేదా ఇంట్లో దీపారాధన మండపం వద్ద చేయవచ్చు.

కార్తీక పౌర్ణమి దీపారాధన విధానం:

365 వత్తులు తయారుచేయడం: దారంతో లేదా దూదితో 365 చిన్న వత్తులను సిద్ధం చేసుకోవాలి.

దీపాన్ని సిద్ధం చేయడం: సాధారణంగా ఈ విశేష దీపారాధన కోసం ఉసిరికాయపై లేదా బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం.

దీపం వెలిగించడం: దీపంలో ఆవు నెయ్యి (శ్రేష్ఠం) లేదా నువ్వుల నూనె పోసి.. 365 వత్తులను ఒకే దీపంలో లేదా అనేక దీపాలలో ఉంచి భక్తిశ్రద్ధలతో వెలిగించాలి.

మంత్ర పఠనం: దీపం వెలిగించే సమయంలో.. శివకేశవుల మంత్రాలు, ‘దీపో జ్యోతిః పరం బ్రహ్మ దీపో జ్యోతిర్ జనార్దనః’ వంటి శ్లోకాలను పఠించడం వల్ల ఆ దీపారాధనకు విశేష ఫలితం లభిస్తుంది.

Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

ఇతర విశేషాలు:
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపారాధనతో పాటు.. ఈ కింద తెలిపిన ఆచారాలను పాటించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

జ్వాలాతోరణ దర్శనం: సాయంత్రం దేవాలయంలో వెలిగించే జ్వాలాతోరణాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు హరించి.. పుణ్యం లభిస్తుందని నమ్మకం.

సత్యనారాయణ స్వామి వ్రతం: కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తేజజ మామూలు రోజుల కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది.

నదీ స్నానం, దానం: ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేసి, పేదవారికి వస్త్ర దానం, ఆహార దానం లేదా బెల్లం దానం (లక్ష్మీ దేవికి సమర్పించడం) శుభప్రదం.

కార్తీక పౌర్ణమి రోజు చేసే ఈ విశేష దీపారాధన, ధర్మాచరణం వల్ల సంవత్సరమంతా మీకు.. మీ కుటుంబానికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది

Related News

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Life of Radha: కృష్ణుడిని ప్రేమించిన రాధ చివరకు ఏమైంది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది?

North face: ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రపోకూడదు?

Big Stories

×