BigTV English

Lakshmi Puja: దీపావళి రోజు వీటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తే.. జీవితాంతం డబ్బుకు లోటుండదు

Lakshmi Puja: దీపావళి రోజు వీటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తే.. జీవితాంతం డబ్బుకు లోటుండదు

Lakshmi Puja: ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31, గురువారం జరుపుకోనున్నాము. దీపావళి హిందువులకు అతిపెద్ద పండుగ. ఈ పండగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీపావళి రోజున మహాలక్ష్మీని పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీపూజను సరైన ఆచారాలు, భక్తి, విశ్వాసంతో నిర్వహిస్తే, సంపద, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీపావళి రోజు లక్ష్మీ పూజ సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి మీ సంపద పెరుగుతుంది. అంతే కాకుండా కుటుంబ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు.


దీపావళి లక్ష్మీ పూజ సమయంలో గుర్తుంచుకోవాల్సినవి:

– లక్ష్మీదేవికి తామర పువ్వు అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి, దీపావళి లక్ష్మీ పూజ సమయంలో, ఖచ్చితంగా తామర పువ్వును సమర్పించండి. ఇలా చేస్తే ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు మీపై నిలిచి ఉంటాయి. అంతే కాకుండా మీ జీవితంలో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు.


– లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో శంఖం కూడా ఒకటి. పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో వెలువడిన రత్నాలలో శంఖం కూడా ఉంది. కాబట్టి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖాన్ని పూజా ప్రదేశంలో ఉంచడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దీంతో పాటు ఇంట్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కూడా పరిష్కారమవుతుంది.

– లక్ష్మీదేవికి ఖీర్ నైవేద్యం చాలా ఇష్టం. వీలైతే, దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి కుంకుమ కలిపిన ఖీర్ సమర్పించండి. లక్ష్మీదేవి ఈ నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాత సంతోషిస్తుంది. ఫలితంగా మీ కుటుంబాన్ని సంపద, శ్రేయస్సుతో నింపుతుంది. ఈ పరిహారంతో, శుక్రుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది.

– లక్ష్మీదేవి పూజలో కొబ్బరికాయను కూడా సమర్పించాలి. కొబ్బరిని శ్రీఫల్ అని కూడా పిలుస్తారు. ఇందులో శ్రీ అంటే లక్ష్మీ. లక్ష్మీ దేవిపూజలో అన్ని పండ్లలోకెల్లా శ్రేష్ఠ ఫలమైన కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

– దీపావళి రోజున కౌరీ ట్రిక్ తప్పకుండా చేయండి. చిరకాల దారిద్య్రాన్ని పోగొట్టే శక్తి ఈ తంత్రానికి ఉందని చెబుతారు. లక్ష్మీపూజలో 5, 7 లేదా 11 గవ్వలను ఉంచి, మరుసటి రోజు వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఇంట్లోని డబ్బు స్థలంలో ఉంచండి.

కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు జరుపుకునే దీపాల పండుగ మంగళవారం, 29 అక్టోబర్ 2024 నుండి ప్రారంభం కానుంది. ఈ ఐదు రోజుల్లో ప్రజలు తమ ఇళ్లను, కుటుంబాన్ని దీపాలతో వెలిగిస్తారు. ఈ దీపావళి రోజుల్లో, లక్ష్మీ దేవి, గణపతి, సరస్వతి , కుబేరుడు, ధన్వంతరిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళికి ముందు మీరు ఇంట్లోకి కొన్ని రకాల మొక్కలను తీసుకువస్తే, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆర్థిక సంక్షోభం నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

Also Read: ధన త్రయోదశి రోజు అరుదైన యోగాలు.. ఈ 3 రాశుల వారిపై లక్ష్మీ కటాక్షం

1. మనీ ప్లాంట్ :

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళికి ముందు ఇంట్లో మనీ ప్లాంట్ ను నాటడం ద్వారా లక్ష్మీదేవి వస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నమ్మకాల ప్రకారం, మనీ ప్లాంట్ సంపదను ఆకర్షిస్తుంది. అలాగే ఈ మొక్క ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, సంతోషం,ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఈ మొక్క గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. మనీ ప్లాంట్ నాటిన ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఉంటుంది.

2. తులసి మొక్క:

హిందూ మతంలో, తులసి మొక్క సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పబడుతుంది. తులసి మొక్క లక్ష్మీ దేవి, శ్రీ హరి నారాయణునికి ఇష్టమైనది. తులసి మొక్క ఉన్న ఇంటి సభ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద కూడా చాలా పెరుగుతుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×