IND Vs PAK : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈనెల 28న జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ లో పాకిస్థాన్ ప్లేయర్స్ కు యానిమల్ మూవీ చూపించడం పక్కా అంటున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 14న లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అలాగే సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో కూడా టీమిండియా.. పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. అలాగే సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో కూడా టీమిండియా.. పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. అలాగే ఫైనల్ లో కూడా టీమిండియా విజయం సాధిస్తుందని అటు అభిమానులు.. ఇటు ఆటగాళ్లు ధీమాలో ఉన్నారు.
Also Read : India vs Pakistan, Final: పాకిస్థాన్ కు ఘోర అవమానం..ఫోటో షూట్ కు సూర్య డుమ్మా…వేయిట్ చేస్తున్న సల్మాన్ ?
మరోవైపు పాకిస్తాన్ జట్టు కూడా రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలై.. ఫైనల్ లో విజయం సాధించి తన ప్రత్యర్థి పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కానీ మరోవైపు టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా గాయపడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. 7 పరుగులు మాత్రమే ఇచ్చి.. కుశాల్ మెండిస్ వికెట్ తీశాడు. ఇక ఆ తరువాత హార్దిక్ పాండ్యా మళ్లీ బౌలింగ్ వేయలేదు. మరోవైపు బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 3 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 పరుగులు చేసి నిష్క్రమించాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కండరాలు పట్టేయడంతో ఫీల్డింగ్ చేయలేదు. అతని స్థానంలో జితేష్ శర్మ ఫీల్డింగ్ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ఆసియాకప్ 2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్ గా ఉన్న అభిషేక్ శర్మ టాపార్డర్ బ్యాటింగ్ అత్యంత కీలకంగా మారనున్నాడు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో కూడా హార్దిక్ పాండ్యా దిట్ట అనే చెప్పాలి.
అన్ని జట్ల కంటే ఎక్కువగా పాకిస్తాన్ తో మ్యాచ్ ల్లో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు హార్దిక్ పాండ్యా కి ఉంది. ఇప్పటివరకు ఆడిన జట్టుతోనే పాకిస్తాన్ తో తలపడుతుందా..? లేకుంటే బౌలింగ్ విభాగంలో ఏమైనా మార్పులు చేస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ తో ఫైనల్ కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని ధీమాలో ఉంది. అభిమానులు.. ప్రపంచ వ్యాప్తంగా అలాగే చెబుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్లకు యానిమల్ చూపించడం పక్కా.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. సెప్టెంబర్ 28 న జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.