Kantara Chapter1 Censor: కన్నడ భాష ప్రాంతీయ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 2022వ సంవత్సరంలో సంచలనాలను సృష్టించిన చిత్రం కాంతార(Kantara). కన్నడ భాషలో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తిరిగి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) నటనకు గాను నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
కాంతార సినిమా భూత కోల నృత్య నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాగా కాంతార ప్రీక్వెల్ సినిమాలో యుద్ధాలు, యువరాణి, ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2 వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇదే తరుణంలో చిత్ర బృందం సెన్సార్(Censor) కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. తాజాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తూ U/A +16 సర్టిఫికెట్ జారీ చేశారు.అలాగే ఒక సీన్ కట్ చేశారని తెలుస్తుంది.
ఇక సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా 168 ని, 53 సెకండ్ల నిడివి రన్ టైంతో ఈ సినిమా విడుదలకు అనుమతి తెలియజేశారు. ఇక 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఈ సినిమాలో అనుమతి లేదు కానీ పేరెంట్స్ లేదా గార్డియన్స్ సమక్షంలో ఈ సినిమా చూసే వెసులుబాటును కూడా కల్పించారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు కూడా లేవని తెలుస్తోంది. అక్టోబర్ రెండో తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒకటవ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి.
ప్రీ రిలీజ్ గెస్ట్ గా ఎన్టీఆర్…
ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి .ఈ అడ్వాన్స్ బుకింగ్ కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది.ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసింది. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా, గుల్హన్ దేవయ్య విలన్ పాత్రలో సందడి చేయబోతున్నారు. జయరాం, రాకేష్ పూజారి వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. హోంభళే నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రెండో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ 28వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్(Ntr) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Also Read: Kantara: కాంతార యూనివర్స్ నుంచి మరో మూవీ… రిషబ్ ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నాడంటే ?