RBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఆఫీసర్ గ్రేడ్-బీ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఆఫీసర్స్ గ్రేడ్ బీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు వెకెన్సీలు..
1. ఆఫీసర్స్ గ్రేడ్-బీ(జనరల్ కేడర్): 83 పోస్టులు
2. ఆఫీసర్స్ గ్రేడ్-బీ(డీఈపీఆర్ కేడర్): 17 పోస్టులు
3. ఆఫీసర్స్ గ్రేడ్-బీ(డీఎస్‌ఐఎం కేడర్): 20 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పిీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు ప్రారంభ వేతనమే రూ.78,450 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 10
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 30
ఎగ్జామ్ డేట్స్..
గ్రేడ్-బీ(డీఆర్)- జనరల్ కేడర్ ఫేజ్-1 పరీక్ష: 2025 అక్టోబర్ 18.
గ్రేడ్-బీ(డీఆర్)- డీఈపీఆర్(పేపర్-1&2): 2025 అక్టోబర్ 19.
గ్రేడ్-బీ(డీఆర్)- జనరల్ కేడర్ ఫేజ్-2 పరీక్ష: 2025 డిసెంబర్ 6.
గ్రేడ్-బీ(డీఆర్)- డీఈపీఆర్(పేపర్-1&2)/డీఎస్‌ఐఎం(పేపర్-2&3): 2025 డిసెంబర్ 7.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది.. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://opportunities.rbi.org.in/=