R Narayana Murthy Comments: సినీ హీరో, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇటూ రాజకీపరంగా, అటూ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సంచలన కామెంట్స్ చేశారు. జగన్ ఓ సైకో అని, సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి అవమానించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీటిపై ప్రతిపక్షాలు, సినీ వర్గాల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్యా కామెంట్స్ని చిరంజీవి ఖండించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వైఎస్ జగన్ ఉద్దేశి స్తూ ఒకింత వ్యంగ్యంగా మాట్లాడారంటూ బహరంగంగా చెప్పారు.
అయితే చిరు స్పందనపై టీడీపీ వర్గాల నుంచి కాస్తా వ్యతిరేకత వస్తుంది. ఈ క్రమంలో బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందించిన తీరుపై తాజాగా సీనీ నటుడు ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఏపీ అసెంబ్లీలో పెద్దలు మాట్లాడిన మాటలపై చిరంజీవి స్పందన ఆయన స్వాగతించారు. చిరంజీవి మాట్లాల్లో అసలు తప్పు లేదని, వందశాతం నిజం మాట్లాడారన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయనకు విలేకరుల నుంచి దీనిపై ప్రశ్న ఎదురైంది. “ఏపీ అసెంబ్లీలో కొంతమందిపెద్దలు మాట్లాడిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పం దించిన వ్యాఖ్యలు అక్షర సత్యం. నాటి వైఎస్సార్ ప్రభుత్వ హాయంలో సినిమాటోగ్రాఫి మంత్రిగా ఉన్న పెర్నినాని గారు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు వెళ్లిన వారిలో నేను కూడా ఉన్నాను.
జగన్మోహన్ గారి ప్రభుత్వం మా సినిమా కళాకారులతో పాటు చిరంజీవి గారిని ఏవరిని అవమానించలేదు. ఆయన సాదరంగా మా అందరిని ఆహ్వానించారు. కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమౌతుందో అనే భయం ఉన్న దశలో పరిశ్రమ పెద్దగా ఆయన చిరంజీవిని కలిశారు. వారితో పాటు నన్ను కూడా ఆహ్వానించారు. చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ప్రభుత్వాన్ని కలవాలని చెప్పారు. అలా పలువురు సినీ ప్రముఖులతో కలిసి మేమంత వెళ్లాం. వారిలో నేను కూడా ఉన్నారు. పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్కి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. మాలో ఎవరిని ఆయన అవమానించలేదు. చాలా గౌరవించారు. న నేను ప్రత్యక్ష సాక్షిని. అంతేకాదు తమ ప్రభుత్వం పరిశ్రమకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు” అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
‘ఇప్పటికీ ఇండస్ట్రీ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏప్రీ ప్రజల, రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కరించాలి. అలాగే ఇండస్ట్రీకి కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏపీ చంద్రబాబు నాయుడు గారూ, ఏపీ సినిమాటోగ్రాఫి మంత్రి కందుల దుర్గేశ్ గారూ పరిశ్రమకు సహకరించాలని కోరుతున్నా. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చోరవ తీసుకుని ఇండస్ట్రీ పరిశ్రమలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా‘ అని ఆయన వ్యాఖ్యానించారు.