BigTV English

Manickam Tagore: జగన్‌కు మాణికాం ఠాకూర్‌ కౌంటర్.. ఓన్లీ రిచ్ పీపుల్‌తో అంటూ..

Manickam Tagore: జగన్‌కు మాణికాం ఠాకూర్‌ కౌంటర్.. ఓన్లీ రిచ్ పీపుల్‌తో అంటూ..

Manickam Tagore: ఏపీలో వైసీపీ లోటును భర్తీ చేసుకునే పనిలో కాంగ్రెస్ పడిందా? వైసీపీ వ్యవహార శైలిపై ఏపీ కాంగ్రెస్ క్రమంగా రియాక్ట్ అవుతుందా? వైసీపీ చేసిన ట్వీట్‌కు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికాం ఠాగూర్ కౌంటరిచ్చారా? ఎన్నికలు ముగిసి నాలుగైదు నెలలు గడిచినా నేతలు, కార్యకర్తలకు.. అధినేత దూరంగా ఎందుకు ఉంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


వైసీపీ కొత్త పల్లవి ఎత్తుకుందా? తిరుమల లడ్డూ, జగన్ ఆస్తుల వివాదంతో ఆ పార్టీ ఇమేజ్ అయినట్టు కనిపిస్తోంది. నేతలు సైతం వలస పోవడంతో డీలా పడుతోంది. దీంతో పాత అస్త్రాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. ఇందులో భాగంగా రోజు లేదా రెండురోజుల కొకసారి వైఎస్ఆర్ ఫోటోతో ట్వీట్ చేస్తోంది. రకరకాల కామెంట్స్ చేస్తోంది.

ప్రజాసమస్యల పరిష్కారమే వైఎస్‌ఆర్ మొదటి ప్రాధాన్యత అంటూ వైసీపీ ట్వీట్‌ చేయడంపై ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌ కౌంటరిచ్చారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ధనవంతుల్నే కలిసేవారంటూ ట్వీట్‌ చేశారాయన. సీఎంగా జగన్ ఉన్నప్పుడు వసూళ్లతో బిజి బిజీగా గడిపారంటూ ఆరోపించారు. ఆయన ఎప్పుడూ వైఎస్‌ను ఫాలో కాలేదని దుయ్యబట్టారాయన.


ఇంతకీ వైఎస్ఆర్ ఫోటోను వైసీపీ ఎందుకు పెట్టింది? కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావాలనే ఆ విధంగా స్కెచ్ వేసిందా? అనే డౌంట్స్ రైజ్ అవుతున్నాయి.  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చూస్తుంటే వైఎస్ఆర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

 

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×