Little Hearts OTT: లిటిల్ హార్ట్స్(Little Hearts) ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియా స్టార్ మౌళి తనూజ్ (Mouli Tanuj), శివాని నాగారం (Shivani Nagaram)జంటగా సాయి మార్తాడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా స్టార్ హీరోల సినిమాలతో పాటు కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది.
ఈ సినిమాతో పాటుగా మదరాసి అనుష్క నటించిన ఘాటీ వంటి సినిమాలు విడుదల అయినప్పటికీ ఈ సినిమాలను వెనక్కి నెట్టి లిటిల్ హార్ట్స్ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఈటీవీ విన్(ETv Win) కొనుగోలు చేశారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారకంగా తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈటీవీ విన్ అధికారక ఎక్స్ ఖాతా ద్వారా.. ఈ సినిమా స్ట్రీమింగ్ గురించి తెలియజేస్తూ.. ఈ ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ రోమ్ కామ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. లిటిల్ హార్ట్స్ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతోంది అంటూ తెలియజేశారు.. ఇలా ఈ సినిమా థియేటర్లు చూడటం మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో ఈటీవీ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు.
The blockbuster rom-com of the year coming to your home…💖#LittleHearts (Extended Cut 🤩)
Streaming from Oct 1 only on @etvwin 🍿!!#OTT_Trackers pic.twitter.com/bJWZU3fM3V— OTT Trackers (@OTT_Trackers) September 26, 2025
ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించింది అయితే నెల తిరగకుండానే తిరిగి ఓటీటీలో కూడా అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఆ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… అఖిల్ (మౌళి) చదువులో పెద్దగా యాక్టివ్ గా ఉండరు అయితే తనని ఇంజనీరింగ్ చదివించాలని తన తండ్రి గోపాలరావు (రాజీవ్ కనకాల) తాపత్రయ పడుతుంటారు. ఎంసెట్లో తనకు మంచి ర్యాంకు రాకపోవడంతో తిరిగి తనని లాంగ్ టర్న్ కోచింగ్ పంపిస్తారు. అక్కడ తనకు కాత్యాయని (శివాని నాగారం) పరిచయమవుతుంది. తనది కూడా అదే పరిస్థితి. కాత్యాయని తల్లితండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడంతో తనని కూడా డాక్టర్ ను చేయాలని ఉద్దేశంతో ఎంసెట్ కోచింగ్ పంపిస్తారు. ఇక్కడే వీరిద్దరి ప్రేమ మొదలవుతుంది. మొదట అఖిల్ తన మనసులో ప్రేమను బయట పెట్టడంతో కాత్యాయని ఓ విషయాన్ని చెబుతుంది. దీంతో కథ మొత్తం కీలక మలుపు తిరుగుతుంది. మరి కాత్యాయని చెప్పిన ఆ విషయం ఏంటి? వీరిద్దరి విషయంలో తల్లిదండ్రుల కోరిక నెరవేరిందా? వీరిద్దరి ప్రేమ ఫలించి పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అనేది తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
Also Read: Kantara Chapter1 Censor: సెన్సార్ పూర్తి చేసుకున్న కాంతార చాప్టర్ 1..రన్ టైం ఎంతంటే?