BigTV English

Thumb Finger : బొటన వేలతో మీరు ఎలాంటి వారు తెలుసుకోండి

Thumb Finger : బొటన వేలతో మీరు ఎలాంటి వారు తెలుసుకోండి

Thumb Finger:బొటన వేలు ప్రతీ మనీషికి ఎంతో ముఖ్యం. ద్రోణాచార్యుడు కూడా ఏకలవ్యుడ్ని బొటన వేలే గురుదక్షిణగా తీసుకున్నాడు. బొటన వేలు ద్వారా మన భవిష్యత్ ను తెలుసుకోవచ్చు. దానికి హస్తసాముద్రనిపుణుల వరకు వెళ్లాల్సిన పనిలేదు. బొటన వేల సైజు చూపుడు వేలు అడుగుభాగానికి తక్కువ ఉంటే దాన్ని మంకీ తంబ్అంటారు. చూపుడు వేలు అడుగు భాగాన్ని దాటి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇలా పొటి వేలు ఉన్న వాళ్లు కోతి లాంటి బుద్ధి ఉంటుంది. అంటే ఈ కొమ్మ నుంచి ఆ కొమ్ము ఊరికే దూకుతుటుంది. అలాంటి వాళ్ల నిర్ణయాలు కూడా అలానే స్థిరత్వం లేకుండా ఉంటాయట.


బొటనవేలు చూపుడి వేలు అడుగుభాగంలోని కణుపు దాటి బాగా పొడుగ్గు ఉంటే వాళ్లకి మంచి యోగం ఉంటుంది. అలాంటి వాళ్లు శక్తితో దేనైన్నా జయిస్తారు. తెలివితేటల్లోను మెండుగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ధైర్యగా ఎదుర్కొని సాల్వ్ చేసుకునే వారవుతారు. బొటన వేలు స్టిఫ్ గా అంటే నిటారుగా ఉంటే వాళు పిసినారి స్వభావం ఉన్నవాళ్లు అవుతారు. ఆ బొటన వేలు వెనక్కి కొంచెం ఒంగి ఉంటే అలాంటి వాళ్లకి జాలి, ఉంటుంది. బొటన వేలు ఇంకా బాగా ఉన్న వాళ్లు కరుణామయులు. వేలు చిలుక ముక్కులా వెనక్కి వంగిపోయి ఉంటే వారికి జాలి,దయ చాలా ఎక్కువగా ఉంటాయి. అవతల వారి సమస్య విని వెంటనే సాయపడుతుంటారు. దీన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకుని ముందుకెళ్లండి.

బొటన వేలు స్టిఫ్ గా ఉన్న వాళ్లు పార్టనర్ మాట విననే వినరు. భార్య కాని భర్త అవతల వ్యక్తి మాట వినరు. బొటన వేలు కొంచెం వెనక్కి వంగి ఉండే వారు పరిస్థితులు బట్టి విన్నట్టు నటిస్తుంటారు.
బొటన వేలు బాగా వెనక్కి వంగే వారు భర్త, భార్య కానీ ఏది చెప్పినా నోరుమూసుకుని వింటారు. ఆడవారి బొటన వేలుపై కన్ను ఆకారం ఉంటే వారు కచ్చితంగా మగపిల్లలు కలుగుతారు. వడ్ల గింజ ఆకారం అంటారు. ఆడవాళ్ల రెండు బొటన వేళ్లపై కన్ను ఆకారం ఉంటే కచ్చితంగా మొదట అబ్బాయి పుడతాడని హస్తసాముద్రిక శాస్తం చెబుతోంది. ఒక వేలిపై కన్ను ఆకారం ఉండి మరో వేలిపై లేకపోతే పుట్టే వాళ్లు తల్లికి సహాయకారిగా ఉంటారు. ఇంటి పనులు కూడా చేస్తుంటారు. అమ్మాయైనా అబ్బాయి మనస్తత్వంతో ఉంటారు. ధైర్యంగా మొండిగా పనిచేస్తారు. ఇందిరాగాంధీ లాగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి.


కొంతమందికి బొటన వేలు దేవాలయం గోపురంలాగా ఉంటుంది. అంటే కింద వెడల్పుగాను పైకి వచ్చేటప్పటికి సన్నగా కోన్ ఆకారంలో ఉంటుంది. అలాంటి వాళ్లు కళారంగంలో అడుగుపెడితే సంచలనాలు నమోదు చేస్తారు. కొంతమందికి బొటన వేల పడవ నడిపే తెడ్డులా ఉంటుంది. అలాంటోళ్లకు రాజకీయాలు, మీడియా రంగంలో రాణిస్తారు. బొటన వేలు పింక్ కలర్ లో ఉంటే మంచిది. అందులో నియో గీతలు ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నల్ల మచ్చలు ఉంటే డయోబైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×