Pawan Kalyan On Reviews : ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్లు కొంతమంది ఆ సినిమా గురించి చెబుతూ ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో న్యూస్ పేపర్స్ లో సినిమా రివ్యూస్ రావడం మొదలయ్యేవి. ఇప్పుడు వెబ్సైట్లో సినిమా రివ్యూస్ వస్తున్నాయి. కొన్ని సినిమాలు రివ్యూలు తెలుసుకోవడానికి వెబ్సైట్స్ కూడా అవసరం లేదు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు, పలాన సినిమాకి సంబంధించిన రివ్యూలు బోలెడుంటాయి.
అందరికీ ఆత్రుత ఎక్కువైపోయింది, ఒక సినిమాకి వెళ్తే టైటిల్ ఫోటో తీసి వాట్స్అప్ స్టేటస్ పెట్టాలి, ట్విట్టర్లో అప్లోడ్ చేయాలి అని ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లందరి గురించి పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా సక్సెస్ మీట్ లో స్పందించారు.
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… సినిమా రిలీజ్ అయిపోయే లోపే, ఆ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి లేదు ఈ షాట్ బాలేదు. అసలు బాగుందో లేదో మీరు రెండున్నర గంటలు చూస్తేనే కదా తెలుస్తుంది. అందరూ సినిమా చూడటం మానేసి రివ్యూవర్స్ లా తయారయ్యారు. ఈ కల్చర్ ఎక్కడో ఒకచోట పోవాలి. పెరుగుట విరుగుట కొరకే అంటారు.
ఈ కల్చర్ పోకపోతే ఇన్ని కోట్లు పెట్టిన నిర్మాతలు నష్టపోతారు. నేను హరిహర వీరమల్లు సినిమాకి చాలా ఇబ్బంది పడ్డాను. అత్తారింటికి దారేది ( Attarintiki daredi) సినిమా కష్టపడి చేస్తే ఇంటర్నెట్లో విడుదల చేసేసారు. ఆ సినిమా విషయంలో నేను నష్టపోయిన దానికి కాటమరాయుడు (katam Rayudu) సినిమా వరకు వడ్డీలు కడుతూనే ఉన్నాను.
యూట్యూబ్లో పెట్టేయడం చాలా ఈజీ, పైరసీ చేసేయడం చాలా ఈజీ. మా కష్టం మీకు తెలియదు. సోషల్ మీడియా ,యూట్యూబర్స్ మీరంతా కూడా ఆలోచించి చేయండి సినిమాను చంపేయకండి. మీరు ఎంతోమంది పొట్ట కొడుతున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. మా ఉసురు తగులుతుంది. మా ఏడుపులు మీకు తగిలేస్తాయి. చాలామంది కడుపుకోత ఆకలి మీకు తగులుతుంది.
ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల్లు సినిమాకి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు బయటకు రాని వాడిని బయటకు వచ్చాను. సినిమాని వదిలేస్తే ఎలా మనమీద నమ్మకంతో వస్తారు అని ఊహించాను. దానివలన వచ్చిన ఆటుపోట్లను ఇప్పటికీ తీసుకుంటున్నాను. అటువంటి నాకు ఓజి సినిమా బలాన్ని ఇచ్చింది. అంటూ పవన్ కళ్యాణ్ రివ్యూవర్స్ పైన రెస్పాండ్ అయ్యారు.
Also Read : OG success Event : ప్రకాశ్ రాజ్ సెట్స్‌లో ఉంటే… పవన్ కళ్యాణ్ నిర్మాతలకు చెప్పిన ఆసక్తికర కామెంట్