Allu Arjun : ప్రముఖ నటులు, హాస్యనటులు అయినటువంటి అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న ఎంతోమంది దిగ్గజ నటులలో ఆయన కూడా ఒకరు. కామెడీ చేయడంలో అతనితో ప్రత్యేకమైన శైలి. కేవలం తన వాయిస్ తోనే నవ్వించగలిగే సామర్థ్యం ఆయనకు ఉంటుంది. ఆయన మేనరిజంస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పటికీ కొన్ని పాత సినిమాలు చూస్తే ఆయన ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.
ఆయన కుమారుడు అల్లు అరవింద్ కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే అల్లు అరవింద్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పైన అద్భుతమైన సినిమాలు చేసి ప్రస్తుతానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అగ్ర నిర్మాతగా చలామణి అవుతున్నారు. అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచం మొత్తం గుర్తింపు సాధించుకున్న నటుడు అల్లు అర్జున్.
ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య అక్టోబర్ ఒకటవ తారీఖున జన్మించిన సంగతి తెలిసిందే. ఈ శుభదినం సందర్భంగా అల్లు శిరీష్ కూడా తను ఒక ఇంటివాడు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం మన మధ్య అల్లు రామలింగయ్య గారు లేరు అనే విషయం విధితమే. ఆయనకు అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ నివాళులర్పించారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సందర్భం ఏదైనా సరే కొన్నిసార్లు తమ అభిమాన హీరో కనిపించినప్పుడు, కొంతమంది అభిమానుల్లో కొన్ని ఆలోచనలు రావడం సహజం. ప్రస్తుతం అల్లు రామలింగయ్య కు నివాళులు అర్పించిన వీడియోలో అల్లు అర్జున్ లుక్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమే ఈ లుక్ అని అర్థమవుతుంది.
ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్లు పెట్టుబడితో ఈ సినిమా నిర్మితమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం జపనీస్ బ్రిటిష్ కొరియోగ్రాఫర్ ని కూడా తీసుకుంటున్నారు. సన్ నెట్వర్క్ సంస్థ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. అలానే అట్లీ కి కూడా 100% సక్సెస్ రేట్ ఉంది. రాజా రాణి సినిమాతో మొదలైన అట్లీ ప్రయాణంలో ఇప్పటివరకు కూడా ఒక్క డిజాస్టర్ సినిమా లేదు. అలానే లాస్ట్ ఫిలిం జవాన్ తో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. అందుకే ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
Also Read: OG Success Event : నా బలహీనతతో తమన్, సుజీత్ ఆడుకున్నారు. చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్