BigTV English

KantaraChapter 1 Twitter review : కాంతారా చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

KantaraChapter 1 Twitter review : కాంతారా చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

Kantara Chapter 1 Twitter review : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతారా. దాదాపు 3 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మామూలు డబ్బింగ్ సినిమా అనుకొని చాలామంది తెలుగు ప్రేక్షకులు చూశారు. కానీ ఆ సినిమా చూడగానే విపరీతంగా నచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి ఫ్రీక్వెల్ సిద్ధం చేస్తూ కాంతారా చాప్టర్ వన్ సినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి.


ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి ట్విట్టర్ లో ఆల్రెడీ పాజిటివ్ టాక్ మొదలైపోయింది. యునానిమస్ గా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తుంది

ట్విట్టర్ రివ్యూ

ఈ సినిమా టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంది. సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమాలో టైగర్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవనుంది. సినిమా క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్.


ఎక్కువగా అందరూ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఫెంటాస్టిక్. స్టోరీ లైన్ అదిరిపోయింది. చివరి పది నిమిషాలు నెక్స్ట్ లెవెల్ . టెరిఫిక్ క్లైమాక్స్. రిషబ్ శెట్టి డైరెక్షన్ మరియు పర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్.

కాంతారా సినిమాలో అందరికీ నచ్చింది ఆ సినిమా క్లైమాక్స్. అప్పటివరకు సినిమా నార్మల్ గా సాగుతూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ అయిపోగానే కొంతకాలం పాటు ఆ విజువల్స్, ఆ సీన్స్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 సినిమా దానిని మించి ఉంది అని పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటేనే అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో రుక్మిణి వసంత నటించిన. ఈ సినిమాకి సంబంధించి కొన్ని వివాదాలు కూడా తెర మీదకు వచ్చాయి. తెలుగు హైదరాబాద్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి కన్నడ మాట్లాడటం పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ పిలుపు కూడా ఇచ్చారు. అదే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి మంచి సపోర్ట్ అందించారు. ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా సినిమా బాగుంటే ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి ఎంత మేరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

Also Read : Allu Arjun : అల్లు రామలింగయ్య కు అల్లు అర్జున్ నివాళి, బన్నీ కొత్త లుక్ చూసారా?

Related News

Kantara Chapter 1 Movie Review : కాంతార చాప్టర్ 1 రివ్యూ

Idli Kottu Movie Review : ఇడ్లీ కొట్టు రివ్యూ.. మూవీలో చట్నీ తగ్గింది

OG Movie Review : ‘ఓజి’ మూవీ రివ్యూ – ఫుల్ మీల్స్ కాదు.. ప్లేట్ మీల్సే

Beauty Movie Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ… బ్యూటీ కాదు స్కూటీ

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

KishkindhaPuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ : భయపెట్టింది.. అయినా ఫోన్ చూడాల్సి వచ్చింది

Mirai Movie Review : మిరాయ్ రివ్యూ – సూపర్ హీరో సూపర్ ఉందా ?

Big Stories

×