OG success Event : పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య ఎప్పుడు పొలిటికల్ వార్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సినిమాల్లో కూడా వీరిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా బద్రి సినిమాలో వీరి పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇప్పటికీ కూడా బద్రి సినిమాలోని నువ్వు నందా అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్ అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఇప్పటికీ కూడా ఒక హై ఇస్తుంది.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని సుజీత్ తీర్చేశాడు. అయితే ఓజి సినిమాలో ప్రకాష్ రాజ్ ను చూసి చాలా మంది ఫ్యాన్స్ ఆశ్చర్యపడ్డారు. మొదటిసారి ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉండడం పై పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నారు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని పవన్ కళ్యాణ్ ను ప్రొడక్షన్ వాళ్ళు అడిగారట. నాకు ఎవరితో కూడా ఏ ఇబ్బంది ఉండదు. పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. ఒక విషయం చెప్పాలి అనుకుంటే మొహమాట పడను చెబుతాను. అలానే నా తోటి యాక్టర్స్ కి కూడా అభిప్రాయాలు ఉంటాయి దానిలో తప్పేం లేదు.
ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా అది అవుతుంది. సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమా నాకు అన్నం పెట్టే తల్లి. ఈరోజు నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. సమాజంలో ఉండే అసమానతుల మీద కోపం బయటికి చూపించడానికి నాకు సినిమా పని చేసింది. అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) సినిమాలో ఉండటం వలన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను. సెట్స్ లో పొలిటికల్ కి సంబంధించిన టాపిక్స్ పెట్టొద్దని చెప్పండి అదొక్కటే నేను కోరుకున్నాను. నేను ప్రొఫెషనల్ గా ఉంటాను, ఆయనను ప్రొఫెషనల్ గా ఉండమనండి. ఆయనతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పైన ఒక బ్రిలియంట్ యాక్టర్. ఆయనకి నాకు మినీ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అది పెద్ద ఇష్యూ కాదు. అది వేరే ప్లాట్ఫారం లో మేము మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారికి మనస్పూర్తిగా నా ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీరియస్ రిక్వెస్ట్, అసలు అది జరిగే పనేనా?