Pawan Kalyan : సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా ఇప్పుడు దాదాపు 300 కోట్లు కలెక్షన్ కు దగ్గరగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ దూరమయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందరి హీరోల అభిమానులను రాజకీయ ప్రసంగాల్లో కలుపుకునే ప్రయత్నం చేశారు.
కేవలం ఇతర హీరోల అభిమానులను కలుపుకోవడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకోవడం కూడా మొదలుపెట్టారు. నేను వీళ్ళందరి కంటే చాలా చిన్న హీరోని అని పవన్ కళ్యాణ్ కొంతమంది ప్రస్తుతం ఉన్న స్టార్ల పేర్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులను సీరియస్ గా రిక్వెస్ట్ చేశారు. దయచేసి ఫ్యాన్ వార్స్ పెట్టుకోకండి. ఫ్యాన్ వార్స్ ఆపేయండి. నేను కళను ప్రేమించే వాడిని. మేము సినిమాల కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లతో తిట్లు తింటాం. కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా ఉండలేం. సుజీత్ ఒక నెల రోజుల వరకు ఇంటికి కూడా వెళ్లలేదు. అంటూ గుర్తు చేశారు.
ఫ్యాన్ వార్స్ చేసుకొని సినిమాను చంపకండి. సినిమాకి షార్ట్ లైఫ్ అయిపోయింది. ఇదివరకు రోజులా లేదు. ఒకప్పుడు 50 రోజులకి 100 రోజులకి ఇటువంటి ఫంక్షన్ లు చేసేవాళ్లం ఇప్పుడు ఆరు రోజులకి చేయాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ ను ఉద్దేశిస్తూ చెప్పారు. ఈ సినిమా విషయంలో కొంచెం ఆగి చేశారు. కానీ మరికొన్ని సినిమాలకు మాత్రం పొద్దున్న రిలీజ్ అయితే సాయంత్రానికి సక్సెస్మెంట్ పెడుతున్నారు.
దయచేసి ఈ ఫ్యాన్ వార్స్ ఆపేయండి ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న వ్యక్తిగత ఆలోచనల వలన ఇలా పిలుపునిచ్చారు. కానీ ఇది జరిగే పని అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే పొద్దున లేచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, ఈ ఫ్యాన్ వార్స్ తో ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ తిట్టుకునే మనుషులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఏమైనా మార్పులు సంభవిస్తాయేమో వేచి చూడాలి.
Also Read: KantaraChapter 1 Twitter review : కాంతారా చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ