Kantara Chapter 1 Movie Review : కన్నడ ఇండస్ట్రీలో 2022లో వచ్చిన ఓ అద్భుతం కాంతార మూవీ. కేవలం 14 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఆ మూవీ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన మూవీనే ఈ కాంతార చాప్టర్ 1. ఇది కూడా రిషబ్ శెట్టి డైరెక్షన్‌లోనే వచ్చింది. కాంతార ఫస్ట్ పార్ట్ కంటే ఇది సక్సెస్ అయిందా..? కన్నడ ఇండస్ట్రీలో మళ్లీ అంతటి మూవీ వచ్చిందా ? అనేది ఈ రివ్యూలో చూద్దాం…
2022లో వచ్చిన కాంతార మూవీలో హీరో వాళ్ల తండ్రి ఓ చోట మాయమైయ్యాడు. అతను అక్కడే ఎందుకు మాయమైపోయాడు ? మాయమైపోయిన వాడి కథ ఏంటి ? అనేదే ఈ కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి చూపించాడు.
సినిమాలో మూడు తెగలు ఉంటాయి. ఈ మూడు తెగలకు పింజర్ల దేవుడు కావాలని అనుకుంటారు. కాంతార తెగ వాళ్లు ఆ దేవుడిని కాపాడుతూ ఉంటారు. ఆ దేవుడికి కాపారి బర్మె (రిషబ్ శెట్టి). ఇంకో తెగ వాళ్లు బంగ్రా. వీరికి రాజు విజయేంద్ర (జయరాం). యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య). యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్). ఈ బంగ్రా వాళ్లకు శివపూతోటకు రావాలని, అక్కడ ఉంటే సుగంధ ద్రవ్యాలను దోచుకోవాలని చూస్తారు. మరో తెగ వాళ్లు కడపటి దిక్కు వాళ్లు… కాంతార వాళ్ల దగ్గర ఉన్న పింజర్ల దేవుడిని మంత్రతంత్రాలతో బంధించాలని అనుకుంటారు. మొత్తంగా వీళ్ల నుంచి బర్మె.. పింజర్ల దేవుడిని కాపాడమే స్టోరీ. ఆ.. క్రమంలో వచ్చే ఇబ్బందులు. వారిని నుంచి ఎలా కాపాడాడు… శివుడు ఎందుకు వచ్చాడు అనేది మిగితా కథ.
కాంతార మూవీని ఎలాంటి అంచనాలు లేకుండా చూశారు. అందుకే ఆ సినిమా అందరికీ నచ్చిందని చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు కాంతార హిట్ అయ్యాక దానికి ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1 పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని అందుకోవడం అంటే డైరెక్టర్ / హీరో రిషబ్ శెట్టికి పెద్ద సవాల్.
అయితే, ఆ అంచనాలు అందుకున్నాడా… కాంతార మూవీ కంటే, ఈ కాంతార చాప్టర్ 1కి మంచి అవుట్ పుట్ ఇచ్చాడా.. అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా, వందకు వంద శాతం ఇచ్చాడు అనే ఆన్సర్ వస్తుంది. కాంతార మూవీలో చివరి 30 నిమిషాలు మాత్రమే ఆడియన్స్‌కు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి.
కానీ, కాంతార చాప్టర్ 1 లో మాత్రం సెకండాఫ్ మొత్తం ఆడియన్స్‌కు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. అయితే, రిషబ్ వాటిపైనే ఎక్కవ ఫోకస్ పెట్టాడేమో… అందుకే అవి కొన్ని చోట్ల ఓవర్ డోస్ కూడా అయ్యాయి. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉన్నా.. చూసే ఆడియన్ గందరగోళానికి గురి అవుతాడు. అసలు ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడకి పోతున్నారు? అనే క్వశ్చన్స్ వస్తాయి. అలా వచ్చినా… ఆ మూమెంట్స్‌ను కొంత మేరకు ఎంజాయ్ అయితే చేస్తాడు.
రివ్యూ చెప్పడం చెప్పడమే సెకండాఫ్ గురించి చెబుతున్నా అని అనుకున్నారా…?
అవును సినిమాలో సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు అందరూ. ఫస్టాఫ్ మొత్తం పాత్రలు.. తెగలను పరిచయం చేయడానికే తీసుకున్నాడు. నార్మల్ గా అయితే, దానికి అంత టైం అక్కర్లేదు. అందుకే, ఫస్టాఫ్ గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడుకోరు. అయితే, ఇంటర్వెల్ సీక్వెల్ అయితే బాగా తీశాడు. నిజానికి సినిమా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాంతార సినిమా క్లైమాక్స్ మరోసారి ఈ కాంతార చాప్టర్ 1 మూవీ ఇంటర్వెల్‌లో చూస్తారు.
ఎప్పటిలానే, పాత్రల పేర్లు, ఆ తెగల పేర్లు తెలుగు ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తాయి. తెలుగులో డబ్ చేసే టైంలో ఆ.. జాగ్రత్తలను స్టోరీకి ఎఫెక్ట్ కాకుండా ప్లాన్ చేసుకోవాల్సింది. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి. అందులో ఒక ట్విస్ట్ ను చూస్తే మొన్నా ఆ మధ్య ఓ కొత్త డైరెక్టర్ తీసిన ఓ హర్రర్ మూవీ గుర్తుస్తొంది.
ఆ ఒక్క సినిమానే కాదు.. మరి కొన్ని సినిమాలు కూడా గుర్తొస్తాయి ఈ కాంతార చాప్టర్ 1 సినిమా చూసినప్పుడు. అయితే, అవి సినిమా చెడిపోవడానికి పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపవు. ఈ సినిమా తెలుగు వాళ్ల కంటే కన్నడ వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది. అక్కడ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు.
రిషబ్ శెట్టి… డైరెక్టర్ గా తన ప్రతిభ చూపించాడు. ఇక యాక్టర్ గా అయితే, నెక్ట్స్ లెవెల్. ఇంత కంటే పెద్ద వర్డ్ వాడలేం. హీరోయిన్ రుక్మిణి వసంత్.. ఈ సినిమాలో అయితే 80 శాతం ఫర్ఫామెన్స్ కాదు… 180 శాతం ఇచ్చిందని చెప్పొచ్చు. గ్లామర్… యువరాణిగా.. ఓ ట్విస్ట్ ఉంటుంది.. అక్కడ కూడా రుక్మిణి వసంత్ యాక్టింగ్ టూ.. గుడ్. అందరినీ మరిచిపోయేలా చేసింది ఆవిడ. జయరాం యాక్టింగ్ క్లైమాక్స్ లో బాగుంది.
టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే… కెమెరా, మ్యూజిక్. ఈ రెండు సినిమాకు ప్రాణం పోశాయి. అడవిని సినిమాటోగ్రాఫర్ వాడుకున్న విదానానికి ఫిదా అవ్వాల్సిందే. మ్యూజిక్… సరైన టైంలో సరిగ్గా వాయించాడు. నిర్మాణ విలువలు… ఎక్కడా తగ్గలేదు హంబోలే వాళ్లు. ఎడిటింగ్.. ఫస్టాఫ్‌లో చాలా వర్క్ చేయాల్సింది.
రిషబ్ శెట్టి నటన, డైరెక్షన్
కథ
సెకండాఫ్
మ్యూజిక్
క్లైమాక్స్
ఫస్టాఫ్
క్లైమాక్స్ లో గందరగోళం
మొత్తంగా… కన్నడలో కమర్షియల్ ఘనం.. తెలుగులో ఒకే ఒకే