BigTV English

Good day for gold Buying : బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. వచ్చే ఏడాది రూ.60వేలు టచ్‌ చేయడం ఖాయం..!

Good day for gold Buying : బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. వచ్చే ఏడాది రూ.60వేలు టచ్‌ చేయడం ఖాయం..!

Good day for gold Buying : ఎప్పటికీ వన్నె తరగతి పెట్టుబడి బంగారం. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కొనేది బంగారాన్నే. కొంతమంది పెట్టుబడిగా కొంటే, ఎక్కువమంది నగల రూపంలో కొంటుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం (Gold price) రూ.54,930 పలుకుతోంది. ఈ ఏడాదంతా చూస్తే గోల్డ్‌ ప్రైస్‌ అప్‌ అండ్ డౌన్స్ అవుతూనే వచ్చాయి. కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలకు తోడు డిమాండ్ పెరగడంతో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. అయితే. .వచ్చే ఏడాది మాత్రం ఈ పెరుగుదల మరింత ఉండొచ్చని.. పది గ్రాముల మేలిమి బంగారం రూ.60 వేలకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


2002 మార్చిలో ఔన్సు బంగారం ధర 2070 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత నవంబర్ నాటికి 1616 డాలర్ల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం 1800 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఆర్థికమాంద్యం భయాలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండడం, చైనాలో మళ్లీ కోవిడ్‌ విజృంభణతో బంగారంపై పెట్టుబడులు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే క్రిప్టో మార్కెట్ ఘోరంగా దెబ్బతింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నా భారీగా రిటర్న్స్‌ వచ్చే పరిస్థితి లేదు. పైగా ఆర్థికమాంద్యం ముంచెత్తుతుందన్న భయంలో ఇన్వెస్టర్లు ఉన్నారు. అందుకే.. వీరందరికీ బంగారమే సేఫ్ బెట్‌గా కనిపిస్తోంది. బంగారంపై ఇలా పెట్టుబడులు పెరిగితే ఔన్సు బంగారం ధర 2000 డాలర్లను తాకవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. రూపాయి విలువ ఇప్పటికే భారీగా పడిపోయింది. ఇంకా పతనం అయితే.. ఔన్సు బంగారం 1900 డాలర్లకు చేరుకున్నా మన దగ్గర తులం బంగారం 60వేలను తాకే అవకాశం ఉంది. అందుకే..  వచ్చే ఏడాది బంగారం కొనాల్సిన అవసరం ఏదైనా ఉంటే.. ఇప్పుడే కొనిపెట్టుకోవడం మంచిందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఒకవేళ ఎక్కువ మొత్తాన్ని ఇప్పుడే ఖర్చు చేసే అవకాశం లేకపోతే మాత్రం నెలవారీగా కొంత కొంత కొనడం వల్ల ప్రయోజనం దక్కించుకోవచ్చంటున్నారు.

ReplyForward


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×