OG Success Event : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంగీత దర్శకుల ప్రస్తావన వస్తే ఒకప్పుడు చాలామంది పేర్లు వినిపించేవి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించే పేరు తమన్. ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా మ్యూజిక్ వినడం మొదలుపెట్టారు. అలా తమిళ్ మ్యూజిక్ బాగా అలవాటు పడి అనిరుద్ రవిచంద్రన్ ఒక రేంజ్ లో లేపారు. అనిరుద్ మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది అందులో సందేహం లేదు.
అయితే కామన్ గా కంపారిజన్ చేయడం అనేది జరుగుతుంది. అలా అనిరుద్ తో కంపేర్ చేస్తూ తమన్ ను ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అయితే వాళ్లందరికీ కూడా తమన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. లియో, జైలర్, విక్రమ్ ఈ మూడు సినిమాలకు ఓజీ సినిమా సమాధానం చెప్పొద్దు అని స్టేట్మెంట్ పాస్ చేశాడు తమన్. దానిని కూడా అందరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ట్రోల్ చేసే అవకాశం లేదు.
మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు ఈవెంట్ జరిగినప్పుడు, అందరూ ఎంతో క్యూరియాసిటీ తో ఎదురుచూసే స్పీచ్ బండ్ల గణేష్. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడే విధానం చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఆ స్పీచ్ ఒక హై ఇస్తుంది. అందుకే చాలామంది బండ్లన్న కళ్యాణ్ గారి ఈవెంట్ కి వస్తున్నావా అంటూ సోషల్ మీడియాలో కూడా అడుగుతుంటారు. ఇప్పుడు ఓజి సక్సెస్ మీట్ లో తమన్ ఆ లోటు తీర్చేశాడు.
నేను ఇంట్లో కంటే ట్విట్టర్ లోనే ఎక్కువ ఉంటాను. అంటూ మొదలుపెట్టాడు తమన్ స్పీచ్. అలానే తన మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించాడు. అందులో ప్రముఖ సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి అబ్బాయి కూడా ఉన్నారు.
ఎస్ ఎస్ తమన్ రామ జోగయ్య శాస్త్రి వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తూ… వీడే మా ఏమినం అంటూ చెప్పారు. వీళ్ళ నాన్న కేవలం తెలుగులో మాత్రమే రాస్తాడు. వీడు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే రాస్తాడు. ఇద్దరు పూర్తి ఆపోజిట్. వీడు రామజోగయ్య శాస్త్రి వాళ్ళ అబ్బాయి అని పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశాడు. అలానే గన్స్ అండ్ రోజెస్ పాటను పాటించాడు తమన్. వీడు సన్ స్ట్రోక్ సార్ అంటూ జోక్స్ వేసాడు తమన్.
అలానే సింగర్ సాకేత్ గురించి పరిచయం చేస్తూ. వీళ్ళ నాన్న పెద్ద సంగీత గురువు. అలానే వీడి దగ్గర కూడా ఒక 50 మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారు. వీడికసలు డబ్బులు గురించి లోటు లేదు సార్ అంటూ పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశాడు. ఇలా తమన్ ప్రతి మాటలోనూ సెటైర్లు వేస్తూ కళ్యాణ్ ను నవ్వించాడు. మొత్తానికి బండ్ల గణేష్ వలన పవన్ కళ్యాణ్ మొహంలో నవ్వొచ్చేది, ఇప్పుడు ఆయన లేని లోటు తమన్ తీర్చేశాడు అని స్పీచ్ చూశాక అర్థమైపోతుంది
Also Read: OG Success Event : నా బలహీనతతో తమన్, సుజీత్ ఆడుకున్నారు. చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్